ఈత.. కడుపు కోత | Sakshi
Sakshi News home page

ఈత.. కడుపు కోత

Published Wed, May 8 2024 5:25 AM

-

● ఈతకు వెళ్లి బాలుడి మృతి ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

చంద్రగిరి: ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని యల్లంపల్లి చెరువులో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు.. భీమవరం గ్రామానికి చెందిన ప్రవీణ్‌(16) తన అమ్మమ్మతో ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ప్రవీణ్‌ మరికొంత మంది స్నేహితులతో కలసి యల్లంపల్లిలోని చెరువులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ప్రవీణ్‌ నీట మునిగాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. అనంతరం గ్రామంలోని గజ ఈతగాళ్లు ప్రవీణ్‌ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. సుమారు 3 గంటల పాటు శ్రమించి ప్రవీణ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. తమ కళ్లెదుటే బిడ్డ మృతి చెందడంతో గ్రామస్తులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement