యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Published Wed, May 8 2024 7:50 AM

-

కొండమల్లేపల్లి : ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపిన ప్రకారం.. రాజస్థాన్‌ రాష్ట్రంలోని బియావర్‌ జిల్లా పాట్వా గ్రామానికి చెందిన ప్రజాపతి సోహన్‌లాల్‌, కమ్లి దంపతుల 3వ కుమారుడు రాకేశ్‌(24) రెండు సంవత్సరాలుగా కొండమల్లేపల్లిలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాకేష్‌ మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి ఈనెల 6న మండల కేంద్రానికి వచ్చాడు. తన పాత యజమాని అయిన సందే కిరణ్‌కు ఫోన్‌ చేసి మళ్లీ షాపులో పనిచేస్తానని ఇక్కడే ఉంటానని అడగడంతో తాను అందుబాటులో లేనని కిరణ్‌ తెలిపాడు. అయితే దుకాణం తాళాలు ఇవ్వాల్సిందిగా రాకేశ్‌ కోరగా కిరణ్‌ తన దుకాణం నుంచి తాళాలు తీసుకొమ్మని చెప్పాడు. మరుసటి రోజు తాళం తీయకపోవడంతో అనుమానం వచ్చిన కిరణ్‌ షాప్‌ తెరిచి చూడగా రాకేష్‌ ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు మృతుని బాబాయి ప్రకాష్‌చంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపారు.

ఫ మృతుడు రాజస్థాన్‌ రాష్ట్ర వాసి

Advertisement
 
Advertisement
 
Advertisement