ఎంత బలమైన దేశమైనా వణికిపోవాలి!
ప్యొంగ్ యాంగ్: తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఉత్తరకొరియా అడుగులు వేస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రూపకల్పణలో తాము ఫైనల్ స్టేజీలో ఉన్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. 2016లో అణు పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం బాలిస్టిక్ మిస్సైల్ చివరిదశకు చేరుకున్నామని న్యూ ఇయర్ స్పీచ్ ఇస్తూ ఆదివారం స్వయంగా ఆయనే తెలిపారు. ప్యొంగ్ యాంగ్ అణు సామర్థ్యాన్ని మెరుచుపరుచుకుందని, బలమైన ప్రత్యర్ధులు సైతం తమ దేశంపై యుద్ధానికి రావాలంటే వణికిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
'గత ఏడాది తాము రెండు అణు పరీక్షలు, క్షిపణిని విజయవంతంగా టెస్ట్ చేశాం. ఎటుంటి పరిస్థితులు ఎదురైనా తమ అణ్వస్త్రాలతో ఢీకొనేందుకు సిద్దంగా ఉంటాం. ఖండాంతర క్షిపణి త్వరలోనే పరీక్షించి మా స్థాయిని పెంచుకుంటాం. అప్పుడు తమ ఆర్మీకి బలమైన అస్త్రాలు అందిస్తాం' అని కిమ్ జోంగ్ పేర్కొన్నారు. అణ్వాయుధాలన్నీ కేవలం తమ ఆత్మ రక్షణ కోసమేనని పేర్కొంటూనే అమెరికా లాంటి దేశాలను ఢీకొట్టాలంటే అణ్వాయుధాలు సమకూర్చుకోవాల్సందేనని మరోసారి ప్రస్తావించారు.