Rajinikanth's 2.o Movie 1st day Collections - Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 10:12 AM

Rajinikanth Akshay Kumar Shankar 2point0 Day One Collections - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన విజువల్ వండర్‌ 2.ఓ. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా నిన్న(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవరాల్‌గా సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చిన కలెక్షన్ల పరంగా 2.ఓ సత్తా చాటుతోంది. ఇప్పటికే అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తొలి రోజు వసూళ్లు 100, 150 కోట్లు అంటూ సందడి చేస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు.

సినిమా మీద భారీ హైప్‌ ఉండటంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా పెద్ద ఎత్తున అయ్యాయి. దీంతో సినిమా తొలి రోజు కలెక్షన్లు వంద కోట్లకు చేరువలో ఉంటాయన్న టాక్‌ వినిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో సినిమా రిలీజ్‌ కావటంతో తొలిరోజు కలెక్షన్లు ఎంతన్నది లెక్క తేలాలంటే కొంత సమయం పట్టే అవకావం ఉంది. (‘2.ఓ’ మూవీ రివ్యూ)

కేవలం తమిళనాట 30 కోట్లకు పైగా వసూళ్ల వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల వరకు కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇక అక్షయ్‌ కుమార్ ప్రతినాయక పాత్రలో నటించటంతో బాలీవుడ్‌లోనూ సినిమా భారీ వసూళ్లే సాధిస్తోంది. తొలి రోజు ఉత్తరాదిలో 20 నుంచి 25 కోట్ల వరకు వసూళ్లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఓవర్‌సీస్‌కూడా కలుపుకుంటే 100 కోట్ల మార్క్‌ ఈజీగానే రీచ్‌ అయి ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. లెక్కలు సరిగ్గా తెలియాలంటే మాత్రం అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
 

Advertisement
 
Advertisement
 
Advertisement