ఉర్దూలో నీట్‌కు కేంద్రం ఓకే | Sakshi
Sakshi News home page

ఉర్దూలో నీట్‌కు కేంద్రం ఓకే

Published Sat, Mar 11 2017 2:21 AM

ఉర్దూలో నీట్‌కు కేంద్రం ఓకే - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ఉర్దూలో నిర్వహించడానికి సిద్ధమేనని కేంద్రం శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ జస్టిస్‌ కురియన్ జోసెఫ్, జస్టిస్‌ ఆర్‌.భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు

. ఈ ఏడాది ఉర్దూ మాధ్యమంలో నీట్‌ నిర్వహణ సాధ్యం కాదని ఆయన కోర్టుకు విన్నవించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నీట్‌ను ఉర్దూలో నిర్వహిస్తామని తెలిపారు.  ఈ కేసులో తమ అభిప్రాయాన్ని మార్చి22లోగా తెలియజేయాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ), డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ), సీబీఎస్సీలను సుప్రీం ఆదేశించింది.

Advertisement
 
Advertisement