డుమిని, మోర్కెల్ ఫిట్ | Sakshi
Sakshi News home page

డుమిని, మోర్కెల్ ఫిట్

Published Mon, Nov 9 2015 11:46 PM

Duminy, Morne Morkel Fit

బెంగళూరు: భారత్‌తో తొలి టెస్టులో దారుణంగా ఓడిన దక్షిణాఫ్రికాకు రెండో టెస్టుకు ముందు ఊరట లభించింది. గాయాల కారణంగా తొలి టెస్టు ఆడని ఆల్‌రౌండర్ డుమిని, పేసర్ మోర్నీ మోర్కెల్ 14 నుంచి జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటారని ఆ జట్టు తెలిపింది. అయితే తొలి టెస్టులో గాయపడ్డ స్టెయిన్ ఆ సమయానికి కోలుకోకపోవచ్చు.
 
 రెండో ర్యాంక్‌లోనే భారత్

 దుబాయ్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఓడినప్పటికీ భారత్ జట్టు ఐసీసీ ర్యాంక్ మాత్రం మారలేదు. ప్రస్తుతం ధోని సేన 114 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉండగా... ఆస్ట్రేలియా 127 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement