మిథాలీ సేనకు ధోని సందేశం | Superstitious MS Dhoni Has a Special Message for Mithali Raj & Girls | Sakshi
Sakshi News home page

మిథాలీ సేనకు ధోని సందేశం

Published Sun, Jul 23 2017 2:03 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

Superstitious MS Dhoni Has a Special Message for Mithali Raj & Girls

నేడు మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌ ఇంగ్లండ్‌ మద్య జరగనుంది. నేపథ్యంలో మహిళల బృందానికి పలువురు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న కోహ్లీ బృందం ఇది వరకే శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా భారత మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని సైతం శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్‌లో ఇప్పటి వరకూ రాణించిన జట్టులో మార్పులు చేయెద్దని సూచించాడు.

"క్రికెట్ అనేది ఒక ఆట మ్రాతమే. కానీ ఇందులో చాలా భ్రమలు ఉన్నాయని వాటి గురించి తాను చెప్తానని అన్నాడు. తన అనుభవాలను, ముఖ్యమైన అంశాలను ఖచ్చితంగా పంచుకుంటానన్నాడు.  ప్రపంచ కప్ మహిళల జట్టు అద్భుతంగా ఆడిందన్నాడు. ఆటలో వత్తడిని ఎదుర్కొనడానికి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని సూచించాడు. పైనల్‌ గెలవడానికి పరిస్థితులను అన్వయించుకోవాలన్నాడు. ఆటలో గెలుపు ఓటముల గురించి ఆలోచించోద్దన్నాడు. సామర్థ్యానికి తగినట్లు ఆడాలని భారత జట్టుకు సూచించాడు. ఆటగాళ్ల అసాధారణ ఆటతీరే ఇండియాకు ప్రపంచ కప్పును అందిస్తుందని పేర్కొన్నాడు. అది ఒక క్యాచ్‌, ఒక రనౌట్‌ చేయడం, అత్యుత్తమ బౌలింగ్‌ చేయడం, ఒక మంచి ఇన్నింగ్స్ నిర్మించడం వంటివి భారత్‌కు కప్పును అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ఆటను ఆటగా ఎంజాయ్‌ చేయండి. ఈ రోజును చరిత్రలో నిలిచిపోయే రోజుగా మార్చండి' అంటూ ధోని మిథాలీ సేనకు శుభాకంక్షలు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement