శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. | here is what sasikala prison life will be like | Sakshi
Sakshi News home page

శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..

Published Thu, Feb 16 2017 8:45 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..

శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..

దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పరప్పణ అగ్రహార జైలు శశికళకు కొత్తేమీ కాదు గానీ, అక్కడ దాదాపు నాలుగేళ్లు ఉండటం మాత్రం అంత సులభం కాదు. 2014 సంవత్సరంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతో పాటు దోషిగా తేలి ఇక్కడకు వచ్చిన అనుభవం ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఒక సాధారణ ఖైదీగా మాత్రమే ఈ జైల్లో ఉండాల్సి వస్తుంది. జయలలితతో కలిసి ఉన్నప్పుడు ఆమెకు కూడా స్పెషల్ హోదా లభించింది. ప్రైవేటు సెల్, ఫ్యాన్, ఇంగ్లీషు, తమిళ వార్తా పత్రికలు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రాజభోగాలన్నీ పోయాయి. సర్వసాధారణంగానే ఇతర ఖైదీల్లాగే మామూలు సెల్‌లో ఆమె ఉండాలి. ఆమెతోపాటు మరో ఇద్దరు మహిళలు కూడా అదే సెల్‌లో ఉంటారు. ఇందులో సర్వసాధారణ సదుపాయాలు మాత్రమే ఉంటాయి. ఏమాత్రం ప్రైవసీ ఉండదు. తెల్లవారుజామున లేస్తే తప్ప టాయిలెట్లను వాడటం అంత ఈజీ కాదు. ఒక గంట తర్వాత రోజంతా అవి కంపు కొడుతూనే ఉంటాయి. ఖైదీలందరికీ తెల్లటి యూనిఫాం తప్పనిసరి. పనిచేయడానికి ఒక బేకరీ, ట్రక్ షాపు.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటే అక్కడ చేసిన పనికి సరిపడ కూపన్లు ఇస్తారు. అక్కడ ఒక గుడి, చర్చి, మసీదు అన్నీ ఉన్నాయి. 
 
పరప్పణ అగ్రహార జైలుకు దాదాపు మూడేళ్ల నుంచి సున్నం కూడా వేయలేదు. కొత్తగా వచ్చినవాళ్లయితే ఈ జైలు చూసి భయపడటం ఖాయం. దాదాపుగా పెద్దగోడలున్న ఓ మురికివాడలాగే ఉంటుందని అంటారు. బ్యారక్‌లలో ఉన్న టాయిలెట్లకు ఒక గంట పాటు మాత్రమే నీళ్లు వస్తాయి. అదే స్పెషల్ సెల్‌లకు అయితే అక్కడి బాత్రూంలలో ఎప్పుడూ నీళ్లు వస్తూనే ఉంటాయి. తాను జైలు నుంచే పార్టీ కోసం పనిచేస్తానని శశికళ చెప్పారు గానీ, అది అంత సులభం కాదు. ఎందుకంటే ఆమె ఇక్కడ కిచెన్‌లో గానీ, బేకరీలో గానీ, చెక్క పని గానీ చేయాల్సి ఉంటుంది. 

తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి

పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు!
నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం
‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం
లొంగిపోయిన చిన్నమ్మ
వీడని ఉత్కంఠ
ఇక అమ్మ ఫొటో కనిపించదా
పన్నీర్‌ శిబిరంలో పదవుల ఆశ
ఆచితూచి అడుగులు
మద్దతు కాదు కృతజ్ఞతే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement