బీటౌన్ కట్టప్ప పొడిచేశాడు!
కొత్త కట్టప్ప వచ్చాడు. ఈయనది బీటౌన్. ఈ కట్టప్పకు జుట్టుంది, ‘బాహుబలి’లో కట్టప్పకు లేదు. కానీ, మిగతాదంతా సేమ్ టు సేమ్! ఇద్దరూ చేసిందొక్కటే! ప్రభాస్‌ను వెన్నుపోటు పొడిచారు. వెనక నుంచి కత్తితో ఓ పోటు పొడిచారు. ‘బాహుబలి’లో సత్యరాజ్ వెన్నుపోటు సీరియస్ అయితే... ఈ బీటౌన్ కట్టప్ప కత్తిపోటు సరదా కోసం చేసింది. బీటౌన్ అంటే బాలీవుడ్.
ఆ కట్టప్ప ఎవరో కాదు... యంగ్ హీరో వరుణ్ ధావన్. ‘బాహుబలి’ హిందీ వెర్షన్ విడుదల చేసిన దర్శక–నిర్మాత కరణ్ జోహార్ మొన్న రాత్రి బీటౌన్‌లో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి సక్సెస్ పార్టీ ఇచ్చారు. అందులో ఈ ఫన్నీ సీన్ చోటు చేసుకుంది. రానా దగ్గుబాటి, వరుణ్ ధావన్, ఆలియా భట్ తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు. ఇంతకీ, ఈ వరుణ్ ధావన్ ఎవరంటే... ఈవీవీ ‘హలో బ్రదర్’ను హిందీలో ‘జుడ్వా’గా రీమేక్ చేసిన దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు. ఇప్పుడీ తండ్రీకొడులు ‘హాలో బ్రదర్’కి సీక్వెల్‌గా హిందీలో ‘జుడ్వా–2’ చేస్తున్నారు.
#bahubali . Did only what #katappa did before this. #Prabhas is really cool and down to earth more power to him but iv got his sword now. pic.twitter.com/2EtAl98b1D
— Varun Dhawan (@Varun_dvn) 20 June 2017