-
నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్
షార్జా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది (2-1 తేడాతో). నిన్న (మార్చి 18) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 17.2 ఓవర్లలో 98 పరుగులకే చాపచుట్టేసింది. మెరుపు అర్దశతకంతో సత్తా చాటిన జద్రాన్.. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మెరుపు అర్దశతకంతో విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. మొహమ్మద్ ఇషాక్ (27), సెదీఖుల్లా అటల్ (19), ఇజాజ్ అహ్మద్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, కర్టిస్ క్యాంపర్, డెలానీ, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్.. 156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4-0-9-4), నవీన్ ఉల్ హక్ (2.2-0-10-3) నిప్పులు చెరగడంతో 98 పరుగులకే కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ, రషీద్ ఖాన్, ఖరోటే తలో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంపర్ (28) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గెరాత్ డెలానీ (21), హ్యారీ టెక్టార్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఐర్లాండ్ గెలువగా.. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
కేఎల్ రాహుల్‌ను ఫాలో అవుతున్న ఆఫ్ఘనిస్తాన్ యువ ఆటగాడు
ఆఫ్ఘనిస్తాన్ యువ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ టీమిండియా మిడిలార్డర్ స్టార్ కేఎల్ రాహుల్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఒమర్జాయ్ ట్రాక్ రికార్డు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్దమవుతుంది. రాహుల్‌లాగే వన్డేల్లో ఐదో స్థానంలో బరిలోకి దిగే ఒమర్జాయ్.. ఇంచుమించు అతనిలాగే పరుగులు సాధిస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు వన్డేల్లో కీలకమైన ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతూ జట్టుకు ఉపయోగపడే కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఇటీవలికాలంలో మిడిలార్డర్లో చూసిన బెస్ట్ బ్యాటర్లు వీరేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా అవసరమైతే బ్యాట్‌ను ఝులిపించగల సమర్దులు కూడా. గత కొన్ని ఇన్నింగ్స్‌ల్లో వీరి బ్యాటింగ్ శైలే ఇందుకు నిదర్శనం. వరల్డ్‌కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ చేసిన మెరుపు సెంచరీ.. కొద్ది రోజుల కిందట శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఒమర్జాయ్ చేసిన విధ్వంసకర శతకం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రాహుల్ విషయానికొస్తే.. అతను ఈ ఏడాది ఇంకా వన్డేల్లో బరిలోకి దిగలేదు. గతేడాది చివర్లో సౌతాఫ్రికా పర్యటనలో ఆడిన మ్యాచ్‌లే రాహుల్‌కు వన్డేల్లో చివరివి. ఒమర్జయ్ విషయానికొస్తే.. ఈ 23 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఈ ఏడాది ఇప్పటికే తన మార్కును చూపించాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇతను చెలరేగిపోతున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో 115 బంతుల్లో 149 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఒమర్జాయ్.. ఇవాళ జరుగుతున్న మూడో మ్యాచ్‌లో అర్దసెంచరీతో (54) రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఒమర్జాయ్.. రహ్మత్ షాతో (65) కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ కష్టాల్లో పడేది. ఒమర్జాయ్, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్ (48), ఇక్రమ్ (32) రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 48.2 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. లంక బౌలర్లలో మధుషన్ 3, అషిత ఫెర్నాండో, దునిత్ వెల్లలగే, అఖిల ధనంజయ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది. గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ స్కోర్లు.. 21, 56, 66, 39, 102, 8, 21, 39, 27 గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఒమర్జాయ్ స్కోర్లు.. 54, 3, 149 నాటౌట్, 97 నాటౌట్, 22, 31 నాటౌట్, 73 నాటౌట్, 27, 19, 62 పై గణాంకాలు చూస్తే రాహుల్ కంటే ఒమర్జాయ్ ఇంకా మెరుగ్గా కనిపిస్తున్నాడు. -
సంచలన శతకం.. సచిన్ రికార్డు బ్రేక్.. కానీ!
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆతిథ్య లంక విధించిన 382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. 55 పరుగులకే అఫ్గన్ ఐదు వికెట్లు కోల్పోయిన వేళ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఒంటరి పోరాటం చేస్తున్న ఐదో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(149- నాటౌట్)కు తోడైన నబీ.. తన వన్డే కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. 130 బంతులు ఎదుర్కొన్న అతడు 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు సాధించాడు. ఒమర్జాయ్తో కలిసి అరుదైన రికార్డు ఈ క్రమంలో ఒమర్జాయ్తో కలిసి అరుదైన ఘనత సాధించిన నబీ.. తన అద్భుత శతకంతో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డునూ బద్దలు కొట్టాడు. కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్- మహ్మద్ నబీ కలిసి 242 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అఫ్గనిస్తాన్ తరఫున ఆరో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. సచిన్‌కు ఎంతో ప్రత్యేకం ఆ సెంచరీ ఇక మహ్మద్ నబీ 39 ఏళ్ల 39 రోజుల వయసులో ఈ వన్డే సెంచరీ సాధించాడు. తద్వారా.. అత్యధిక వయసులో వన్డేల్లో శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో సచిన్‌ను అధిగమించాడు. 2012లో బంగ్లాదేశ్‌తో మిర్పూర్ వన్డేలో.. 38 ఏళ్ల 327 రోజుల వయసులో సచిన్ టెండుల్కర్ సెంచరీ చేశాడు. అతడి అంతర్జాతీయ కెరీర్లో అదే వందో శతకం కావడం విశేషం. జాబితాలో ముందున్నది వీళ్లే ఇదిలా ఉంటే.. అత్యధిక వయసులో వన్డే శతకం సాధించిన జాబితాలో ఖుర్రం ఖాన్(132 రన్స్- యూఏఈ- 43 ఏళ్ల 162 రోజులు), సనత్ జయసూర్య(107 రన్స్- శ్రీలంక- 39 ఏళ్ల 212 రోజులు), క్రిస్ గేల్(162 రన్స్- 39 ఏళ్ల 159 రోజులు), ఎడ్ జోయిస్(116 రన్స్- 39 ఏళ్ల 111 రోజులు), జెఫ్రీ బాయ్‌కాట్(105- రన్స్- 39 ఏళ్ల 51 రోజులు) నబీ కంటే ముందున్నారు. కాగా శ్రీలంకతో తొలి వన్డేలో ఒమర్జాయ్, నబీ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 42 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. -
39/6.. ఓటమి కొరల్లో చిక్కుకున్న జట్టును గెలిపించిన బాబర్ ఆజమ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (49 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి కొరల్లో చిక్కుకున్న తన జట్టును టెయిలెండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (35 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సాయంతో విజయతీరాలకు చేర్చాడు. 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న రంగ్‌పూర్ రైడర్స్‌ను బాబర్-ఒమర్జాయ్ జోడీ అజేయమైన 86 పరుగులు జోడించి 4 వికెట్ల తేడాతో గెలిపించింది. Flies into the BPL ✈️ Scores an unbeaten 50 🏏 Wins it for his team 💪 Boss it like Babar 👑 . .#BPL2024 #BPLonFanCode #BabarAzam pic.twitter.com/5kChUkZhHY — FanCode (@FanCode) January 23, 2024 బీపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (జనవరి 23) జరిగిన మ్యాచ్‌లో సిల్హెట్ స్ట్రయికర్స్, రంగ్‌పూర్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. రిపన్ మొండల్ (2/19), మెహిది హసన్ (2/18), మొహమ్మద్ నబీ (1/17), హసన్ మురద్ (1/29) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో హోవెల్ (43), కట్టింగ్ (31), షాంటో (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఛేదనలో బాబర్ ఆజమ్ జట్టు రంగ్పైర్ రైడర్స్ కూడా తడబడింది. దుషన్ హేమంత ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో (39/6) పడింది. అయితే బాబర్.. ఒమర్జాయ్ సహకారంతో రైడర్స్‌కు అపురూప విజయాన్ని అందించాడు. మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరూ జాగ్రత్తగా ఆడి 18.2 ఓవర్లలో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. రైడర్స్ జట్టులో ముగ్గురు డకౌట్లు కాగా.. రోనీ తాలుక్దార్ 6, నురుల్ హసన్ 8, షమీమ్ హొసేన్ 2 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో హేమంత 3, నగరవ, తంజిమ్ సకీబ్, నజ్ముల్ ఇస్లాం తలో వికెట పడగొట్టారు. చదవండి: ఫలితాలు పట్టించుకోం.. బాబర్ గెలిపించలేకపోయాడు: షాహిన్ ఆఫ్రిది -
'వరల్డ్‌కప్‌లో అదరగొట్టాడు.. కచ్చితంగా ఐపీఎల్లో కూడా ఆడుతాడు'
వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్ సెమీఫైనల్స్‌కు చేరకపోయినప్పటికీ.. తమ అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో పోరాడి అఫ్గానిస్తాన్ ఓడింది. ఈ మెగా టోర్నీలో అఫ్గాన్ జట్టుతో పాటు ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా సత్తాచాటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఈ అఫ్గాన్ ఆల్‌రౌండర్ దుమ్ములేపాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 97 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు భారత్, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో కూడా ఒమర్జాయ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 353 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఒమర్జాయ్‌పై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఒమర్జాయ్ కచ్చితంగా ఐపీఎల్ 2024లో కాంట్రాక్ట్ పొందుతాడని చోప్రా జోస్యం చెప్పాడు. "ఒమర్జాయ్ అద్భుతమైన ఆల్‌రౌండర్. అతడు ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందుతాడని నేను భావిస్తున్నాను. డిసెంబర్ 19న జరగనున్న వేలంలో లక్నో ఫ్రాంచైజీ అతడని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రొమారియో షెపర్డ్‌ని ముంబై ట్రేడింగ్ చేసింది. దీంతో లక్నో ఫ్రాంచైజీలో ఆల్‌రౌండర్ కోటా ఖాళీ అయింది. ఈ క్రమంలో ఆ స్ధానాన్ని ఒమర్జాయ్తో భర్తీ చేసుకునే అవకాశం ఉందని" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. -
గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా
ICC WC 2023- Afghanistan: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ జట్టు ప్రదర్శన పట్ల అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఆఖరి దాకా పట్టుదలగా పోరాడిన తీరు అద్భుతమని ఆటగాళ్లను కొనియాడాడు. మెగా టోర్నీలో భాగం కావడం వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని.. తమ భవిష్యత్తుకు అవెంతో ఉపయోగపడతాయని పేర్కొన్నాడు. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో ఆరంభంలో పరాజయాలు చవిచూసిన అఫ్గనిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌పై గెలిచి చరిత్ర సృష్టించిన అఫ్గన్.. అనంతరం శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లపై గెలిచింది. తొలిసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత ఈ నేపథ్యంలో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు ఖాతాలో వేసుకున్న హష్మతుల్లా బృందం.. బంగ్లాదేశ్- శ్రీలంక మ్యాచ్ ఫలితం తర్వాత చాంపియన్ ట్రోఫీ-2025 బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో సెమీస్ రేసులో నిలిచిన అఫ్గనిస్తాన్.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్‌డెర్ డసెన్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) వాళ్లు అద్భుతం దీంతో పరాజయంతో ప్రపంచకప్ టోర్నీని ముగించింది. అయితే, ఇంతవరకు వరల్డ్‌కప్ చరిత్రలో తమకు సాధ్యం కాని విషయాలెన్నో ఈసారి చేసి చూపించింది అఫ్గనిస్తాన్ జట్టు. ముఖ్యంగా యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తొలిసారిగా వరల్డ్‌కప్‌లో అఫ్గన్ తరఫున సెంచరీ చేసి సత్తా చాటాడు. మరోవైపు.. బౌలింగ్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 97(నాటౌట్) పరుగులు చేయడం విశేషం. ఇక జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది బ్యాటర్‌గానూ రాణించాడు. టోర్నీలో మొత్తంలో 310 పరుగులు సాధించాడు. లోపాలు, బలహీనతలపై చర్చించాం ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లో తమ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన హష్మతుల్లా.. ‘‘టోర్నీ ఆసాంతం మా బ్యాటర్లు ఆడిన తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. ఆరంభంలో గెలుపు కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అయితే, లోపం ఎక్కడుంది.. మా బలహీనతలు ఏమిటన్న అంశంపై అందరం కూర్చుని చర్చించాం. దాని ఫలితమే ఈ విజయాలు. ఈ టోర్నీలో రాణించడం మాకు సానుకూలాంశం. మా స్పిన్ విభాగం పటిష్టమైందని అందరికీ తెలుసు. ఇప్పుడు బ్యాటర్లు కూడా మెరుగ్గా ఆడటం మరింత ఉత్సాహాన్నిస్తోంది. అదొక్కటే షాకింగ్ ఈ టోర్నీ ద్వారా మేము పెద్ద జట్లపై కూడా గెలవగలమని.. గెలుపు కోసం ఆఖరి వరకు పోరాడగలమనే సందేశాన్ని క్రికెట్ ప్రపంచానికి అందించాం. అయితే, ఆస్ట్రేలియా విషయంలో ఆఖరి వరకు మ్యాచ్ మా చేతిలో ఉన్నా అనూహ్య రీతిలో చేజారిపోయింది. అదొక్కటే మాకు ఇప్పటికీ షాకింగ్‌గా ఉంది అని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అఫ్గన్ విజయంపై ధీమాగా ఉన్న తరుణంలో.. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అజేయ ద్విశతకంతో ఆసీస్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. దీంతో అఫ్గనిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించగా.. సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఇంటిబాట పట్టింది. చదవండి: ICC: శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత.. View this post on Instagram A post shared by ICC (@icc)
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటు హక్కు వినియోగించుకున్న నారా ఫ్యామిలీ
ప్రజలంతా మనసాక్షితో ఓటు వేయాలి - అనిల్ కుమార్
భారత న్యూయార్క్ కాన్సులేట్ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది!
పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడులు
అవ్వ ప్రేమ కు పేర్ని నాని ఫిదా
ఓటు వేసిన సీఎం జగన్ కుమార్తెలు
శ్రీనగర్‌లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
Virat Kohli: నన్నే ఏడిపిస్తావా?.. ప్రతీకారం తీర్చుకున్న కోహ్లి!
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
తప్పక చదవండి
- పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్‌లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement