-
యెమెన్‌లో కేరళ నర్సుకు నిరాశ
ఢిల్లీ: యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సుకు నిరాశే ఎదురైంది. ఆమె మరణశిక్షపై దాఖలు చేసిన అప్పీల్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు తన కూతుర్ని విడిపించడానికి యెమెన్ వెళ్లాలని బాధితురాలి తల్లి చేసిన అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని గురువారం కోరింది. కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే మహిళ తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో తలాల్ అబ్దో మహదీ అనే వ్కక్తికి మత్తుమందు ఇచ్చి చంపినట్లు కోర్టు దోషిగా తేల్చింది. మరణశిక్ష విధించింది. ఈ కేసులో 2017 నుంచి నిమిషా ప్రియ యెమెన్‌లో జైలు శిక్ష అనుభవిస్తోంది. అరబ్ దేశంలో అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉంది. అయినప్పటికీ యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియను విడుదల చేయడానికి మహదీ కుటుంబంతో నష్టపరిహారం గురించి చర్చలు జరపడానికి యెమెన్ వెళ్లాలని కోరుకుంటోంది. తన బిడ్డను కాపడటానికి తప్పకుండా యెమెన్ వెళ్లాల్సి ఉందని ధర్మాసనానికి ప్రియ తల్లి విన్నవించుకున్నారు. అందుకు ప్రయాణ నిషేధం అడ్డుగా ఉందని పేర్కొన్నారు. యెమెన్ ప్రయాణ నిషేధాన్ని సడలించవచ్చని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులు యెమెన్ వెల్లడానికి ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రియా విడుదల కోసం "సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్" అనే బృందం 2022లో హైకోర్టును ఆశ్రయించింది. నిమిషా ప్రియను రక్షించేందుకు దౌత్యపరమైన జోక్యం చేసుకోవడంతో పాటు కేంద్రం చర్చలు జరపాలని కోరింది. అయితే.. ప్రియాను రక్షించడానికి పరిహారం గురించి చర్చలు జరపాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఆమెను దోషిగా నిర్ధారించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ధర్మాసనం వెల్లడించింది. ఇదీ చదవండి: లాటరీలో రూ.45 కోట్లు గెలుచుకున్న కేరళవాసి -
ఆస్పత్రిలో నలుగురు శిశువుల మృతి: నర్సు అరెస్టు
మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో ఓ ఆస్పత్రిలో పనిచేసే నర్సును పోలీసులు అరెస్టు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నలుగురు శిశువుల మరణానికి కారణమైందన్నది ఆమెపై ఉన్న ఆరోపణ. ఇదే కేసులో ఇప్పటికే ఆ ఆస్పత్రిలోనే పనిచేస్తున్న భూషణ్ కట్టా అనే వైద్యుడిని అరెస్టు చేశారు. తాజాగా విద్యా తోరట్ అనే ఈ నర్సును కూడా అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీళ్లిద్దరూ కూడా పంజాబ్రావు దేశ్‌ముఖ్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) విభాగంలో పనిచేస్తుంటారు. అక్కడ చిన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే నలుగురు శిశువులు మరణించారని పోలీసులు చెప్పారు. మెడికల్ కాలేజి, ఆస్పత్రులను శ్రీ శివాజీ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తుంది. గత వారంలో నెలలు నిండకముందే పుట్టిన నలుగురు పిల్లలను ఇక్కడి ఎన్ఐసీయూలో చేర్చారు. అయితే వారు సోమవారం తెల్లవారుజామున మరణించారు. విద్యా తోరట్ ఆ నలుగురు పిల్లలకు తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిందని అధికారులు అంటున్నారు. పొటాషియం క్లోరైడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే పిల్లలు మరణించారన్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే రవి రాణా డిమాండ్ చేశారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం గురించి తాను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని డివిజనల్ కమిషనర్ జేపీ గుప్తా తెలిపారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మంచికి చెడుకు మధ్య యుద్ధం: వైఎస్ జగన్
పచ్చ మేనిఫెస్టోలో పచ్చి మోసాలు
స్టార్ హీరోయిన్‌కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
నా స్నేహితుడు: అల్లు అర్జున్
‘కేజ్రీవాల్ అవుట్ కాలేదు.. రిటైర్డ్ హర్ట్ అయ్యారంతే’
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. ఆర్జేడీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మంచికి చెడుకు మధ్య యుద్ధం: వైఎస్ జగన్
మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
కైకలూరులో సీఎం జగన్ కాన్వాయ్ ర్యాలీ కిక్కిరిసిన జనం
తప్పక చదవండి
- ‘ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- ‘మిమ్మల్ని ప్రాధేయ పడుతున్న’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- టీడీపీ, పవన్‌కు మంత్రి బొత్స కౌంటర్
- సీఎం జగన్‌కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement