ఆకస్మిక ఆంక్షలు: షాక్‌లో దిగ్గజ కంపెనీలు, దిగుమతులకు బ్రేక్‌! | Sakshi
Sakshi News home page

ఆకస్మిక ఆంక్షలు: షాక్‌లో దిగ్గజ కంపెనీలు, దిగుమతులకు బ్రేక్‌!

Published Fri, Aug 4 2023 2:39 PM

Apple Samsung halt laptop imports to India after sudden restrictions - Sakshi

ల్యాప్‌టాప్‌లు,కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం  నిర్ణయం  చైనా కంపెనీలతో  సహా ,ఆపిల్‌, శాంసంగ్‌,హెచ్‌పీ లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది.  ముఖ్యంగా ఫెస్టివల్‌ సీజన్‌  సమీపిస్తున్న తరుణంలో చైనా  లైసెన్సు లేకుండానే చిన్న టాబ్లెట్‌ల నుంచి ఆల్ ఇన్ వన్ పీసీల దిగుమతులపై ఆంక్షలు ఆయా కంపెనీల ఆదాయంపై భారీగా ప్రభావం చూపనుంది. ల్యాప్‌టాప్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, మేకిన్‌ఇండియా,  స్థానిక ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ ఈ చర్య  తీసుకుంది.  (పల్సర్‌ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?)

లైసెన్స్‌లను తప్పనిసరి చేయడంతో ప్రపంచంలోని అతిపెద్ద పీసీ మేకర్స్‌, ఇతర  కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. భారతదేశానికి ల్యాప్‌టాప్‌లు టాబ్లెట్‌ల కొత్త దిగుమతులను నిలిపివేశాయి. అయితే ఆకస్మిక లైసెన్సింగ్ ప్రకటించడం పరిశ్రమను అతలాకుతలం చేసిందని నిపుణులు  వ్యాఖ్యానిస్తున్నారు.  విదేశీ సంస్థల బహుళ-బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఇది భారీ గండి కొడుతుందని అంచనా.  రానున్న  దీపావళి షాపింగ్ సీజన్,బ్యాక్-టు-స్కూల్ కాలం సమీపిస్తున్నందున డిమాండ్‌ పుంజుకోనున్న టైంలో  లైసెన్సులను ఎలా త్వరగా పొందాలనే దానిపై  సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి.  (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ)

గ్లోబల్ ఇన్వెంటరీ, అమ్మకాల వృద్ధిని పునఃప్రారంభించడానికి  కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న తయారీదారులకు ఈ అవసరం అదనపు తలనొప్పిని సృష్టిస్తుందనీ, ఫలితంగా దేశీయ లాంచ్‌లు ఆలస్యం కావడానికి లేదా విదేశీ సరుకులపై ఇప్పటికీ ఎక్కువగా ఆధారపడే కంపెనీల్లో ఉత్పత్తి కొరతకు దారితీయవచ్చనేది ప్రధాన ఆందోళన.

కాగా దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై  ముఖ్యంగా చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో తీసుకున్న ఈ నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్‌ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.2022–23లో భారత్‌ 5.33 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పర్సనల్‌ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్‌ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్‌ తదితర ఎల్రక్టానిక్‌ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.

మరోవైపు దేశీయంగా ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు ఇతర హార్డ్‌వేర్ తయారీదారులను ఆకర్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం 170 బిలియన్ రూపాయల ($2.1 బిలియన్) ఆర్థిక ప్రోత్సాహక ప్రణాళిక కోసం దరఖాస్తులను కోరుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement