హైదారబాద్,సాక్షి : ఎలక్షన్ కమిషన్ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదని అన్నారు. స్థానిక భాషను అధికారులు అర్థం చేసుకోకుండా పై అధికారులకు నివేదికలు ఇచ్చినట్లు అర్థమవుతుందని తెలిపారు.
‘కాంగ్రెస్ నేతలు నేను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే ఎంపిక చేసి ఫిర్యాదులో పేర్కొన్నారు. నేను కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించాను. కానీ నా మాటల్ని కాంగ్రెస్ నేతలు ట్విస్ట్ చేశారు’ అని కేసీఆర్ తెలిపారు.
ఇదెక్కడి అరాచకం?
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇదెక్కడి అరాచకం? ఏకంగా కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? బడే భాయ్.. చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది! అంటూ ట్వీట్ చేశారు.
ఇదెక్కడి అరాచకం...?
ఏకంగా Telangana ki Awaaz KCR గొంతు పైనే నిషేధమా..?
మోడీ విద్వేష వ్యాఖ్యలు
ఈసీకి వినిపించలేదా..? Zero action against Modi despite thousands of citizens’ complaints
రేవంత్ బూతులు EC కి
ప్రవచనాల్లాగా అనిపించాయా...? No action against the foul mouthed Cheap…— KTR (@KTRBRS) May 1, 2024
Comments
Please login to add a commentAdd a comment