ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రుతురాజ్ మెరిశాడు.
48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రుతురాజ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన సీఎస్‌కే కెప్టెన్‌గా గైక్వాడ్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 509 పరుగులు చేసిన గైక్వాడ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్‌కే లెజెండ్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది.
ఐపీఎల్-2013లో 461 పరుగులు చేశాడు. తాజా సీజన్‌తో ధోని ఆల్‌టైమ్ రికార్డును గైక్వాడ్ బ్రేక్ చేశాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రుతురాజ్(509) కొనసాగుతున్నాడు. రెండో స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(500) పరుగులతో ఉన్నాడు.
Most runs by a CSK captain in an IPL season:
509* - R Gaikwad in 2024 (10 mat)
461 - MS Dhoni in 2013 (18 mat)
455 - MS Dhoni in 2018 (16 mat)
416 - MS Dhoni in 2019 (15 mat)
414 - MS Dhoni in 2008 (16 mat)
Ruturaj Gaikwad becomes the first CSK captain to score 500+ runs in an… pic.twitter.com/T73Q8Y3aac— CricTracker (@Cricketracker) May 1, 2024
Comments
Please login to add a commentAdd a comment