కొత్త మార్క్‌కు బంగారం.. నిన్ననే కొన్నవారు సేఫ్‌! | Sakshi
Sakshi News home page

కొత్త మార్క్‌కు బంగారం.. నిన్ననే కొన్నవారు సేఫ్‌!

Published Fri, Apr 19 2024 11:30 AM

gold price today 19 april 2024 gold rate - Sakshi

Gold Rate today: పసిడి కొనుగోలుదారులకు ఇది చేదువార్త. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్‌ 19) మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజులు బ్రేక్‌ ఇచ్చి ఈరోజు మళ్లీ పెరిగి కొత్త మార్క్‌ను చేరాయి.

హైదరాబాద్‌ నగరంతోసహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.74,340 లకు ఎగిసింది.

ఇతర నగరాల్లో బంగారం ధరలు
♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.68,900 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.600 చొప్పున ఎగిసి రూ.75,160 లను తాకింది.

♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్ద​కు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది.

♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,300 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 పెరిగి రూ.74,490 లకు ఎగిసింది.

♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది.

Advertisement
Advertisement