
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గి పసిడి ప్రియులకు ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 2) భారీ స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.870 మేర ఎగిశాయి.
హైదరాబాద్, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ. 72,270 లను తాకింది.
ఇతర ప్రధాన నగరాల్లోి ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 ఎగిసి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.760 పెరిగి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.72,270 వద్దకు ఎగిసింది.
చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.67,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.870 పెరిగి రూ.73,250 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 ఎగిసి రూ.72,270 లకు చేరుకుంది.