ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాలు: రూ.9,300 విలువైన షేర్లు బైబ్యాక్‌ | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాలు: రూ.9,300 విలువైన షేర్లు బైబ్యాక్‌

Published Thu, Oct 13 2022 9:21 PM

Infosys Q2 Result: Net Profit Rises 11 Pc To Rs 6021 - Sakshi

భారత్‌లో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ముగిసిన త్రైమాసికానికి రూ.6,021 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే రెండో త్రైమాసికంలో నికర లాభంలో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సెప్టంబర్‌లో ఇదే కాలానికి రూ.5,241 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

గతేడాది పోలిస్తే ఇన్ఫోసిస్‌ ఆదాయం 23.4 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ.29,602 కోట్ల ఆదాయాన్ని గడించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా రూ. 36,538 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. Q2 FY22లో ఆర్జించిన ఆదాయం ప్రకారం 23.4 శాతం వృద్ధిని సాధించింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికర లాభాలు 12.3 శాతం పెరగగా, క్రమానుగతంగా ఆదాయం 6 శాతం పెరిగింది. రూ.9,300 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలుచేయాలని ఇన్ఫోసిస్‌ బోర్డు నిర్ణయించింది. అందుకు గరిష్ట బైబ్యాక్ ధరను రూ. 1,850గా కంపెనీ నిర్ణయించింది.

చదవండి: ఏముంది భయ్యా ఆ జీన్స్‌ ప్యాంట్‌లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్‌!

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement