గంగమ్మకు ‘మకర తోరణం’ | Sakshi
Sakshi News home page

గంగమ్మకు ‘మకర తోరణం’

Published Thu, Apr 18 2024 10:40 AM

కరుణకుమార్‌కు బిరుదు ప్రదానం చేస్తున్న నిర్వాహకులు   - Sakshi

చౌడేపల్లె : బోయకొండ గంగమ్మకు ఇత్తడి మకర తోరణాన్ని ఆలయ కమిటీ సభ్యుడు రాజేష్‌ శుక్రవారం విరాళంగా అందజేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తెలిపారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఉత్సవమూర్తికి మకరతోరణం అలంకరించేందుకు అందించినట్లు వివరించారు. అనంతరం దాతను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సురేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరకుమార్‌, సిబ్బంది కృష్ణారెడ్డి, సురేంద్రరెడ్డి, హరిప్రసాద్‌, వశిష్టా చార్యులు పాల్గొన్నారు.

నేటి నుంచి నామినేషన్లు

చిత్తూరు రూరల్‌: జిల్లాలో గురువారం నుంచి నామినేషన్ల కోలాహలం మొదలుకానుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతున్న నేపథ్యంలో తొలిరోజే నామినేషన్‌ వేయాలని పలువురు అభ్యర్థులు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల సమర్పణకు అవకాశం ఉంది. ఈ మేరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు మంచి ముహూర్తాల కోసం పండితులు, సిద్ధాంతులను ఆశ్రయిస్తున్నారు. ఆయా అభ్యర్థుల జాతక చక్రాలు, నామ/జన్మ నక్షత్రాలకు అనుగుణంగా ముహూర్తాలను నిర్ణయిస్తున్నారు. పంచాంగం ప్రకారం చూస్తే ఈనెల 18, 19, 21, 22, 24, 25 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని వేదపండితుడు సుధాకర్‌ గురుకుల్‌ తెలిపారు.

ఆదర్శనీయులు ‘ఆంధ్రకేసరి’

చిత్తూరు రూరల్‌: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శనీయులని, తెలుగుజాతి కీర్తికిరీటమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి ఐ. కరుణకుమార్‌ కొనియాడారు. బుధవారం చిత్తూరులోని పలమనేరు రోడ్డులో ఉన్న భారతీయ తెలుగు రచయితల సమాఖ్య కార్యాలయంలో వ్యవస్థాపకులు మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో సాహితీవేత్తలు, సంఘసేవకులకు ‘ఆంధ్రకేసరి’ జాతీయ సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. న్యాయమూర్తి మాట్లా డుతూ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ప్రకా శం పంతులు పాత్రను గమనిస్తే రోమాంఛిత ఘట్టాలెన్నో కనిపిస్తాయన్నారు. సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సి.నారాయణ స్వామి మాట్లాడుతూ దేశప్రజల ఆక్రోశానికి సారథిగా నిల్చి ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా పేరుపొందారని తెలిపారు. అనంతరం కరుణకుమార్‌కు ‘న్యాయవిభూషణ’ బిరుదును దేవేంద్రరావు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు కొఠారి వెంకటరత్నం, శాంతకుమారి, లావణ్య, సోము ఉమాపతి, సి. సుబ్రమణ్యంరెడ్డి, తోట గోవిందన్‌, ఆదివిష్ణు బాలచంద్ర, పాలకూరు కన్నయ్య, గొడుగుచింత గోవింద య్య, సంఘ సేవకులు కోటేశ్వర మొదలియార్‌, కడియాల ఆనందనాయుడు, జ్ఞానశేఖరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement