2019 తరువాత పరిస్థితి మారిపోయింది | Sakshi
Sakshi News home page

2019 తరువాత పరిస్థితి మారిపోయింది

Published Wed, May 8 2024 4:50 AM

-

అప్పుల నుంచి ఉన్నతస్థా‘నాని’కి.. ● దారిద్య్ర రేఖను దాటిన దేవరకొండ నాని, మేరీ కుటుంబం ● పనుల కోసం నూజివీడుకు వలస వచ్చి జీవనం ● వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కష్టాలన్నీ దూరం

2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రావడంతో నాని, మేరీల కుటుంబ పరిస్థితి మెరుగుపడింది. పెద్ద కుమార్తె విజయ డిగ్రీకి రావడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేయడంతో ఫీజుల భారం తప్పింది. అంతకుముందు ఇంటర్‌ రెండేళ్లు చదివించడానికి నాని రూ.50 వేలు అప్పు చేశాడు. డిగ్రీ జగనన్న దయ వల్ల పూర్తయింది. ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడికి అమ్మఒడి పథకం రావడంతో ఈ నాలుగేళ్లుగా పిల్లలను చదివించడానికి ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. మధ్యాహ్నం జగనన్న గోరుముద్ద తినడం, జగనన్న విద్యాకానుక ద్వారా బ్యాగులు, షూలు, పుస్తకాలు, యూనిఫాం తదితర వాటినన్నింటినీ ప్రభుత్వమే ఉచితంగా అందజేయడంతో పిల్లల చదువులు ఎలాంటి భారం లేకుండా సాగుతున్నాయి. నాని ఇసీ్త్ర చేస్తుండటంతో రెండేళ్లుగా జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేలు వస్తున్నాయి. అవి వేడినీళ్లకు చన్నీళ్ల తోడు లాగా ఉపయోగపడుతుండేవి. మేరీ డ్వాక్రా గ్రూపులో ఉండటంతో ఏటా రుణమాఫీ కింద రూ.20 వేలు నగదు వస్తోంది. ఇప్పటికి రూ.60 వేలు రాగా, ఈ ఏడాది మంజూరు చేసిన రూ.20 వేలు బ్యాంకు ఖాతాలో పడాల్సి ఉంది. వచ్చిన సొమ్మును కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా ముందుకు నడుపుకుంటున్నారు. అంతక్రితం చేసిన అప్పులూ తీర్చేశారు. మగపిల్లలు ఇద్దరూ ఇంటర్‌ చదువుతుండగా, కుమార్తె డిగ్రీ పూర్తి చేయడంతో ఆమెను హైదరాబాద్‌ పంపించి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం శిక్షణను ఇప్పించుకుంటున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్లే సాధ్యమైందని, తమ కుటుంబం నేడు ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తోందని దంపతులిద్దరూ ఆనందబాష్పాలతో చెబుతున్నారు. తాము జీవితాంతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని చెప్పారు.

సొంతూరిలో పనులు లేక కట్టుబట్టలతో, ముగ్గురు పిల్లలతో 13 ఏళ్ల క్రితం ఏలూరు జిల్లా నూజివీడుకు వలస వచ్చారు దేవరకొండ నాని, మేరీ దంపతులు. వీరి స్వగ్రామం కృష్ణాజిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను. ఒక కుమార్తె, ఇద్దరు కుమారులను చదివించుకోవాలంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితులు కావడంతో పిల్లల భవిష్యత్‌ ఏమవుతుందోనని దంపతులు నిత్యం మదనపడుతూ ఉండేవారు. పిల్లలను మంచి చదువులు చదివించగలుగుతామో లేదోననే బాధ వారిని నిరంతరం వేధిస్తూ ఉండేది. పట్టణంలోని ఎంప్లాయీస్‌ కాలనీలో ఎనిమిది ప్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా నాని చేరారు. అక్కడే ఉంటూ ఇసీ్త్ర కూడా చేస్తూ పిల్లలను చదివిస్తూ వచ్చారు. ఇద్దరు మగపిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ, ఆడపిల్లను మాత్రం ప్రైవేటు స్కూల్లో చదివించేవారు. వీరి చదువులు, ఫీజులకు ఏటా రూ.50 వేల వరకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సంపాదన మూరెడు, ఖర్చు బారెడు కావడంతో ఏడాదికేడాదికి అప్పులు పెరుగుతూనే వచ్చాయి. ఒకవైపు ఇల్లు గడవడం కష్టంగా ఉండటం, మరోవైపు అప్పులు పెరుగుతూ రావడంతో ఆ దంపతులు తల్లడిల్లిపోయేవారు.

– నూజివీడు

Advertisement
Advertisement