మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌తెలుసుకోండి! | Sakshi
Sakshi News home page

మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌తెలుసుకోండి!

Published Wed, May 8 2024 5:47 PM

check these  Benefits of Sprouts And Its Side Effects

మొలకెత్తిన గింజధాన్యాలను తినడం వలనఅనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  బరువు తగ్గాలన్నా, మంచి పోషకాలు అందాలన్నా మొలకలు తినాల్సి ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మొలకలతో వచ్చే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసు కుందాం.

గర్భిణీ స్త్రీలకు
శరీరానికి విటమిన్‌ సి, ఫైబర్ , జింక్‌, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా   లభిస్తాయి. మొలకలలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.  గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా అవసరం. ఆహారంలోని ఫోలేట్ సరైన పోషకాలను పిండానికి అందేలా సహాయపడుతుంది. పిల్లల మంచి మెదడు అభివృద్ధికి మంచిది . ఇంకా మలబద్ధకం , పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి.

విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదల ఉండేలా చేస్తుంది. జుట్టు రాలడం, తొందరగా జుట్టు  మెరిసిపోవడం తగ్గుతుంది. రక్త ప్రసరణ పెరిగి, జుట్టును బలోపేతం చేసి పెరుగుదలకు సహాయపడుతుంది. 

మొలకలలో విటమిన్ ఏ అధిక సంఖ్యలో ఉంటుంది. ఇది కంటిశుక్లం రేచీకటి  నివారణలోనూ మొత్తం కంటి ఆరోగ్యానికి మంచిది.

శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మాస్కులర్ డిజెనరేషన్ సమస్యకు  బాగా పనిచేస్తుంది. 

శాఖాహారులు మొలకలను తీసుకున్నప్పుడు ప్రోటీన్ అందుతుంది. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్  గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సహాయ పడతాయి.

మొలకలలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. వీర్యకణాల కదలికలు కూడా చురుగ్గా ఉంటాయి.

మొలకల్లో  విటమిన్ B లభిస్తుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. చర్మ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. సాధారణ జలుబు, ఆస్తమా నివారణలో సాయపడతాయి.

సైడ్-ఎఫెక్ట్స్ & అలర్జీలు
తక్కువ నాణ్యత గల మొలకలను ఉపయోగించినప్పుడు మొలకలు శరీరంలో సాల్మొనెల్లా, ఇ కోలి బ్యాక్టీరియా , వైరస్ దాడికి కారణమవుతాయని తెలుస్తోంది.  ఒక్కోసారి, జ్వరం  అతిసారం బారిన పడ్డారు . కొంతమందికి కడుపు తిమ్మిరి ఏర్పడింది.  మొలకలు సరియైన పద్ధతిలో రాకపోతే హానికరమైన బ్యాక్టీరియా పుడుతుంది.

నోట్‌: ఇది అవగాహన కోసం అనేది గమనించగలరు. ఏదైనా మితంగా తింటే మంచిది. మొలకలు తిన్నపుడు ఏదైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తేం వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

Advertisement
 
Advertisement
 
Advertisement