హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను అధికారికంగా, ఘనంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ను వేదికగా ఎంచుకుంది. అయితే.. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా పలువురు లీడర్లను భాగం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆహ్వానం పంపారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఓ లేఖ సైతం రాశారు. ఈ మేరకు ఆ లేఖను మాజీ సీఎంకు అందజేసే బాధ్యతల్ని తన ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్‌కు, డైరెక్టర్ అరవింద్ సింగ్‌కు సీఎం రేవంత్ సూచించారు.
కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆ లేఖను అందించేందుకు గజ్వేల్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు సీఎంవో అధికారులు. స్వయంగా కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను, సీఎం రాసిన లేఖను అందజేసే యత్నం చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు మరికొందరు నేతలకు సైతం ఆహ్వానాలు పంపాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment