USA: టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం.. ప్రజలను తరలిస్తున్న అధికారులు

Published Wed, Feb 28 2024 11:11 AM

Wild Fire Rage In Texas - Sakshi

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కార్చిచ్చు రెండింతలవడానికి కారణమైందని వాతావరణ శాఖ తెలిపింది. 780 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 2 లక్షల ఎకరాల్లో వృక్షాలు కార్చిచ్చుకు ఆహుతయ్యాయని ఎఅండ్‌ఎమ్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ తెలిపింది.

వీటిలో అతి పెద్ద కార్చిచ్చు స్మోక్‌ హౌస్‌ క్రీక్‌ ఫైర్‌ లక్ష ఎకరాలు, గ్రేప్‌ వైన్‌ క్రీక్‌ ఫైర్‌ 30 వేల ఎకరాలు, విండీ డ్యూసీ ఫైర్‌ 8 వేల ఎకరాలను దహించి వేసింది. కార్చిచ్చు బీభత్సం కారణంగా పలు కౌంటీల్లో ప్రజలను తరలిస్తున్నారు.

తూర్పు టెక్సాస్‌, ద మిల్స్ క్రీక్‌, సాన్‌జాసిన్టోల్లో కార్చిచ్చు ఎగిసిపడుతోంది. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. కార్చిచ్చు పరిస్థితిని టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ సమీక్షించారు. ప్రజలు కార్చిచ్చు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఇదీ చదవండి.. మాలిలో ఘోర బస్సు ప్రమాదం

Advertisement
Advertisement