వడదెబ్బకు గురైన గర్భిణి | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు గురైన గర్భిణి

Published Sat, Apr 20 2024 1:55 AM

కుప్పకూలిన గర్భిణిని పరిశీలిస్తున్న ఆయాలు, వైద్య సిబ్బంది - Sakshi

జనగామ: జనగామ చంపక్‌హిల్స్‌ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌) వెయింటింగ్‌ హాల్‌లో ఓ గర్భిణి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఓ మండలానికి చెందిన ఎనిమిది నెలల గర్భవతి కావ్య ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చింది. వెయిటింగ్‌ హాల్‌లో ఉన్న సమయంలో ఉక్కపోత కారణంగా ఊపిరాడక డీ హైడ్రేషన్‌కు గురై కూర్చున్న చోట నుంచే కింద పడిపోయింది. అక్కడే ఉన్న ఆయాతో పాటు కుటుంబ సభ్యులు ఆస్పత్రి నిర్వహణ తీరుపై మండిపడ్డారు.

ఫ్యాన్‌ తిరగదు.. కూలర్‌ లేదు

నెలవారి చెకప్‌, డెలివరీ, బాలింతలు, ఇతర ఆరోగ్య సమస్యలపై ఎంసీహెచ్‌కు రోజూ 200 మంది ఔట్‌ పేషెంట్లు ఉదయం 8 గంటలకు చేరుకుంటారు. డాక్టర్‌ వచ్చే వరకు గంటల తరబడి వెయింటింగ్‌ హాల్‌లో నిరీక్షిస్తారు. ఇక్కడ గర్భిణులకు సరైన వసతులు లేవు. సరిపడా కుర్చీలు లేక కిందనే కూర్చునే పరిస్థితి. ప్రస్తుతం 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వెయింటింగ్‌ హాల్‌లో ఒక్క ఫ్యాన్‌ తిరగడం లేదు. గతంలో అందుబాటులో ఉన్న కూలర్లు సైతం రిపేరుకు రావడంతో మూలన పడేశారు.

ఎంసీహెచ్‌లో ఫ్యాన్లు లేవు..

రిపేరులో కూలర్లు

గర్భవతులను పట్టించుకోని అధికారులు

గంటల తరబడి ఓపీలో వెయిటింగ్‌

ప్రభుత్వం స్పందించాలి..

ఎండలు మండుతున్న సమయంలో ఆస్పత్రి లో ఫ్యాన్లు.. కూలర్లు లేకపోవడం దారుణం.. తక్షణమే ఏర్పాటు చేయాలని బీఎస్‌పీ నాయకుడు పంగ ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఎంసీహెచ్‌కు వచ్చిన ఆయ న.. గర్భిణులకు కనీస వసతులు లేకపోవడాన్ని చూసి ఆశ్చర్య పోయారు. పైన రేకుల షెడ్డు.. అధిక వేడి.. గాలి ఆడడంలేదు.. ఈ క్రమంలో గర్భిణి నవ్య డీ హైడ్రేషన్‌కు గురై కుప్పకూలి పోవడం తనను కలచి వేసిందని, ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement