స్పైడర్‌ మేన్‌ను దాటిన డెడ్‌ పూల్‌! | Sakshi
Sakshi News home page

స్పైడర్‌ మేన్‌ను దాటిన డెడ్‌ పూల్‌!

Published Thu, Feb 15 2024 5:55 AM

Deadpool 3: Deadpool and Wolverine trailer launch - Sakshi

హాలీవుడ్‌ సూపర్‌ హీరోస్‌ ఫిల్మ్స్‌లో ‘డెడ్‌ పూల్‌’ ఫ్రాంచైజీ ఒకటి. 2016లో వచ్చిన ‘డెడ్‌ పూల్‌’, 2018లో వచ్చిన ‘డెడ్‌ పూల్‌ 2’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకులను అమితంగా అలరించాయి. తాజాగా ‘డెడ్‌ పూల్‌’ సిరీస్‌లోని మూడో భాగం ‘డెడ్‌ పూల్‌ అండ్‌ వోల్వరైన్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ర్యాన్‌ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మెన్‌ ప్రధాన పాత్రల్లో, ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్‌ డెలానీ కీలక పాత్రల్లో నటించారు. షాన్‌ లెవీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

జూలై 26న ‘డెడ్‌ పూల్‌ అండ్‌ వోల్వరైన్‌’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లో 365 మిలియన్‌ వ్యూస్‌ను సాధించింది. 24 గంటల్లో ఇన్ని వ్యూస్‌ రావడంతో ఇదే ప్రపంచ రికార్డు అని మేకర్స్‌ పేర్కొన్నారని హాలీవుడ్‌ అంటోంది. గతంలో ఈ రికార్డు 2021లో విడుదలైన ‘స్పైడర్‌మేన్‌: నో వే హోమ్‌’ ట్రైలర్‌ పేరిట ఉండేది. 24 గంటల్లో ‘స్పైడర్‌ మేన్‌: నో వే హోమ్‌’ ట్రైలర్‌ 355.5 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఇప్పుడు ‘డెడ్‌ పూల్‌ అండ్‌ వోల్వరైన్‌’ ట్రైలర్‌ రాకతో ‘స్పైడర్‌మేన్‌: నో వే హోమ్‌’ సెకండ్‌ ప్లేస్‌లోకి వెళ్లింది.

- పోడూరి నాగ ఆంజనేయులు

Advertisement
 
Advertisement
 
Advertisement