Hansika Motwani Wedding Teaser Is Out Now - Sakshi
Sakshi News home page

Hansika Motwani : పెళ్లైన వ్యక్తితో హన్సిక ప్రేమ.. తల్లిని ఎలా ఒప్పించిందంటే..

Published Tue, Jan 31 2023 1:41 PM

Hansika Motwani Wedding Teaser Is Out Now - Sakshi

దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలె వ్యాపారవేత్త సోహైల్‌ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లికి మొదట్లో కుటుంబసభ్యులు అంగీకరించలేదు.

ఈ విషయాన్ని స్వయంగా హన్సిక తన వెడ్డింగ్‌ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనికి సోహైల్‌కు ఇది వరకే పెళ్లై, విడాకులు తీసుకోవడం కారణమని తెలుస్తుంది. ఇక పెళ్లకి ముందు కూడా సోహైల్‌ గురించి వచ్చిన వార్తలు తనను ఇబ్బంది పెట్టినట్లు చెబుతూ హన్సిక బాగా ఎమోషనల్‌ అయ్యింది.

దీనికి సంబంధించిన టీజర్‌ విడుదలైంంది. మొత్తంగా హన్సిక కూడా సాధారణ అమ్మాయిలానే ప్రియుడితో పెళ్లికి ఒప్పించడానికి చాలానే కష్టపడినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement