నటి న్యూడ్‌ ఫోటో.. నెటిజనుల ప్రశంసలు | Sakshi
Sakshi News home page

నటి న్యూడ్‌ ఫోటో.. నెటిజనుల ప్రశంసలు

Published Tue, Jan 5 2021 7:54 PM

Kabir Singh Actress Shared Nude Photos Championing Body Positivity - Sakshi

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. షాహీద్‌ కపూర్‌, కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో ఇంట్లో పని మనిషి పాత్ర చేసిన నటి గుర్తుందా. ఆమె పేరు వనితా ఖరత్‌. సినిమాలో కూడా ఇదే పేరుతో నటించిన ఈ నటి తాజాగా అభిమానులకు షాక్‌ ఇచ్చారు. న్యూడ్‌ ఫోటోలు పోస్ట్‌ చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. న్యూడ్‌ ఫోటోలు పోస్ట్‌ చేసినప్పటికి ఆమె ఉద్దేశం మంచిది కావడంతో అభిమానులు ప్రశంసిస్తున్నారు. బాడీ పాజిటివిటీ పేరుతో వనితా ఖరత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్‌ ఫోటోని పోస్ట్‌ చేశారు. ఇక ఆమె ముందు భాగంలో నీలి రంగు గాలి పటం మాత్రమే ఉంది. (అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా)

ఇక వనితా ఖరత్ ‘నా ప్రతిభ పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను.. నా పాషన్‌, నా నమ్మకం, నా శరీరం పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే నేనంటే నేనే గనుక’ అంటూ షేర్‌ చేసిన ఈ ఫోటో అభిమానులను అలరిస్తుంది. ‘మన పట్ల మనకు నమ్మకం, ప్రేమ ఉండటం ఎంత ముఖ్యమో చాలా బాగా చెప్పారు’.. ‘ఫోటో అసభ్యతకు తావు లేకుండా అందంగా ఉంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇక వనితా ఖారత్‌ బాలీవుడ్‌లోనే కాక పలు మరాఠీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement