Karthik Aaryan Reacts On Dating Rumours With Sara Ali Khan And Ananya Panday, Deets Inside - Sakshi
Sakshi News home page

Kartik Aaryan: ఎవరు పిలిస్తే వారితో వెళ్లిపోతా.. అందుకే అలా: కార్తీక్ ఆర్యన్

Published Mon, Jan 23 2023 6:32 PM

Kartik Aaryan on dating rumours with Sara Ali Khan and Ananya Panday - Sakshi

ఇటీవల 'భూల్​ భులయ్యా 2' సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా మారాడు చాక్లెట్‌ బాయ్‌ కార్తిక్‌ ఆర్యన్‌. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్​ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్​ తర్వాత భారీ విజయాన్ని అందించింది. బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌గా పేరున్న ఆర్యన్‌పై డేటింగ్‌ రూమర్లు పెద్ద ఎత్తున వైరలయ్యాయి. ఈ జాబితాలో సారా అలీ ఖాన్, అనన‍్య పాండే కూడా ఉన్నారు. అయితే ఇంతవరకు ఈ వార్తలపై ఎక్కడా నోరు విప్పలేదు కార్తీక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ‍్నలకు తొలిసారి డేటింగ్ వార్తలపై స్పందించారు. 

కార్తీక్ మాట్లాడుతూ..  ' నాకు కాఫీ తాగడం అంటే ఇష్టం. ఎవరైనా నాతో  కాఫీ తాగడానికి పిలిస్తే వారితో వెళ్లిపోతా.  ఈ విషయంలో నేను చాలా నిజాయితీగా ఉంటా. నాపై డేటింగ్ వార్తలు చాలా వస్తుంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను. ప్రజలు బయటి ప్రపంచంలో కనిపించే వాటినే ఎక్కువగా నమ్ముతారు. వార్తల్లో వచ్చిన వాటిని చూసి వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనుకుంటూ ఉంటారు. ' అని అన్నారు. 

కాగా.. కార్తీక్ 2020లో లవ్ ఆజ్ కల్‌లో సారా అలీ ఖాన్‌తో కలిసి పనిచేశాడు. పతి పత్నీ ఔర్ వో సినిమా సమయంలో కార్తీక్, అనన్య డేటింగ్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. కార్తీక్ ప్రస్తుతం కృతి సనన్‌తో నటించిన షెహజాదా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 10, 2023న విడుదల కానుంది. కార్తీక్ చేతిలో కెప్టెన్ ఇండియా, సత్యప్రేమ్ కీ కథ, ఆషికి 3 కూడా ఉన్నాయి. అతను హేరా ఫేరి 3లో కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement