ఓటీటీలో చంద్రముఖి 2 సినిమా.. ఒకరోజు ముందుగానే! | Netflix Announced Raghava Lawrence Chandramukhi 2 Movie OTT Release Date - Sakshi
Sakshi News home page

Chandramukhi 2 Official OTT Date: అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోన్న చంద్రముఖి 2

Published Sat, Oct 21 2023 4:40 PM

Netflix Announced Chandramukhi 2 Movie OTT Release Date - Sakshi

హారర్‌ సినిమాలకు పెట్టింది పేరు రాఘవ లారెన్స్‌. ముని, కాంచన(ముని సీక్వెల్‌), కాంచన 2, కాంచన 3 సినిమాలను డైరెక్ట్‌ చేశాడు. దర్శకత్వం వహించడమే కాదు, ఈ సినిమాలన్నింటిలో లారెన్సే హీరోగా నటించాడు. ఇవి కాకుండా శివలింగ, రుద్ర  అని మరికొన్ని హారర్‌ చిత్రాల్లో నటించాడు. ఇటీవలే బ్లాక్‌బస్టర్‌ మూవీ చంద్రముఖికి సీక్వెల్‌లో నటించాడు. చంద్రముఖిని తెరకెక్కించిన డైరెక్టర్‌ పి.వాసుయే ఈ సీక్వెల్‌కు డైరెక్షన్‌ చేశాడు. ఈ చిత్రంలో కంగనా రనౌత్‌ హీరోయిన్‌గా నటించింది.

లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ మూవీకి ఆస్కార్‌ విజేత ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు. సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రముఖి 2 చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది. బాక్సాఫీస్‌ దగ్గర మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మొన్నటివరకు ఈ చిత్రం అక్టోబర్‌ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోందీ చిత్రం. అక్టోబర్‌ 26న ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

‘‘క్లిక్‌ చేసి సాక్షి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి’’

చదవండి: మూడుసార్లు ప్రెగ్నెన్సీ ఫెయిల్‌, డిప్రెషన్‌.. అందుకే సీరియల్స్‌కు గుడ్‌బై..

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement