రాజకీయ ఎంట్రీపై స్పందించిన హీరో విశాల్‌.. | Sakshi
Sakshi News home page

Vishal: ప్రజలకు రుణపడి ఉంటా.. చేతనైనంతలో సాయం చేయాలనుకున్నా..

Published Wed, Feb 7 2024 12:19 PM

Tamil Actor Vishal Says No Politics Amid Reports of Him Starting Party - Sakshi

సినీతారలకు రాజకీయాలు కొత్తేం కాదు. సినిమాల ద్వారా ఆదరణ పొందిన ఎంతోమంది సెలబ్రిటీలు పాలిటిక్స్‌లో తమ లక్‌ పరీక్షించుకున్నారు. కొందరికి రాజకీయాలు కలిసొచ్చాయి. మరికొందరికి అచ్చి రాకపోవడంతో యూటర్న్‌ తీసుకున్నారు. ఇకపోతే కొంతకాలంగా ఓపక్క సినిమాలు చేస్తూ మరోపక్క ప్రజాసేవ చేస్తున్న దళపతి విజయ్‌ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదివరకే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత పాలిటిక్స్‌కే పరిమితం అవుతానని ప్రకటించాడు.

ప్రజలకు రుణపడి ఉంటా..
తాజాగా హీరో విశాల్‌ సైతం రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ అంశంపై విశాల్‌ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశాడు. 'నన్ను నటుడిగా, సామాజిక కార్యకర్తగా గుర్తించిన తమిళ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు చేతనైనంతలో ప్రజలకు సాయం చేయాలనుకున్నాను. అందుకే నా ఫ్యాన్స్‌ క్లబ్‌ ఏదో సాదాసీదాగా కాకుండా ప్రజలకు ఉపయోగపడేదిలా ఉండాలనుకున్నాను.

తర్వాతి స్టెప్‌ అదే..
ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వాలన్నదే ఫ్యాన్స్‌ క్లబ్‌ ప్రధాన ఉద్దేశ్యం. నెక్స్ట్‌ స్టెప్‌లో నియోజకవర్గాల వారీగా, జిల్లాలవారీగా ప్రజా సంక్షేమ ఉద్యమాన్ని చేపడతాం. మరోవైపు మా అమ్మ పేరిట నిర్వహిస్తున్న దేవి ఫౌండేషన్‌ ద్వారా ప్రతి ఏడాది నిరుపేద విద్యార్థులకు చేయూతనిస్తున్నాం. రైతులకు కూడా సాయం చేస్తున్నాం. షూటింగ్‌కు వెళ్లిన చాలా చోట్ల జనాల కనీస అవసరాలు, సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను.

ఇదంతా రాజకీయాల కోసం చేయలేదు
వీటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నేనెన్నడూ ఆశించలేదు. అయితే సమాజం కోరుకుంటే భవిష్యత్తులో జనాల కోసం ముందుకు రావడానికి వెనకడుగు వేయను' అని విశాల్‌ తన ఎక్స్‌ (ట్విటర్‌) మీడియా వేదికగా  ఓ లేఖ విడుదల చేశాడు. అంటే ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్తులో రాజకీయ అరంగేట్రం ఉండవచ్చని చూచాయగా చెప్పాడు.

చదవండి: ఇన్‌డైరెక్ట్‌గా ప్రియుడ్ని పరిచయం చేసిన బబ్లీ బ్యూటీ

Advertisement
 
Advertisement
 
Advertisement