బీఆర్‌ఎస్‌ జెండా పట్టే నాయకుడే ఉండడు | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ జెండా పట్టే నాయకుడే ఉండడు

Published Sat, Apr 20 2024 1:40 AM

 మునుగోడు, సింగారం మాజీ సర్పంచ్‌లను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న రాజగోపాల్‌రెడ్డి
 - Sakshi

మునుగోడు: రానున్న రోజుల్లో గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ జెండా పట్టే నాయకుడే ఉండడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సింగారం, చొల్లేడు, మునుగోడు మాజీ సర్పంచ్‌లు గుర్రాల పరమేష్‌, జనిగల మహేశ్వరి, మిర్యాల వెంకన్నలు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలతో పాటుఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలు బయటపడుతుండడంతో ఆ పార్టీలో కొనసాగేందుకు నాయకులు ఇష్టపడడం లేదన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, బంధువులు తప్ప ఆ పార్టీలోని ఇతర నాయకులంతా ఎప్పుడు కాంగ్రెస్‌లో చేరుదామని ఎదురుచూస్తున్నారన్నారు. త్వరలో మునుగోడు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు భారీగా చేరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.

ఫ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement