వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి | Sakshi
Sakshi News home page

వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

Published Tue, May 7 2024 5:25 AM

-

నారాయణపేట రూరల్‌: పట్టణంలోని మినీ స్టేడియం పక్కన గల బాలకేంద్రంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్‌ మహిపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు 41రోజుల పాటు శిక్షణ ఇస్తామని, 5 నుంచి 16 సంవత్సరాల మధ్య గల చిన్నారులకు తబల, సితార్‌, చిత్రలేఖనం, గాత్రం, నృత్యం, కీబోర్డ్‌, డ్రమ్స్‌, దేశభక్తి, దైవభక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలపై శిక్షణ ఇస్తామని తెలిపారు.

జాబ్‌మేళా

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో పలు ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించారు. వివిధ కళాశాలల నుంచి మొత్తం 450 మంది ఔత్సాహికులు హాజరవగా.. ఇందులో 125 మంది పలు ఉద్యోగాలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు కళమ్మ, కేశవర్ధన్‌గౌడ్‌, రాజవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

పీయూలో సిలబస్‌ మార్పుపై సమీక్ష

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో బీఈడీ విద్యార్థులకు సిలబస్‌లో మార్పులు చేయడంపై సోమవారం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ని పలు ప్రైవేటు బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, బీఓఎస్‌లు, హెచ్‌ఓడీలతో పీయూ రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సిలబస్‌లో మార్పులు చేపట్టిన నేపథ్యంలో అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు పలు చర్యలు తీసుకోవాలని, రికార్డుల నిర్వహణపై జాగ్రత్త వహించాలన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement