ముఖ్యమంత్రి తండ్రి ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స! | Sakshi
Sakshi News home page

Rajasthan: ముఖ్యమంత్రి తండ్రి ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స!

Published Sat, Dec 16 2023 10:17 AM

CM Bhajan Lal Sharma Father Health Update Undergoing Treatment - Sakshi

రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం కిషన్ స్వరూప్ శర్మ.. జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్‌ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. 

వివరాల్లోకి వెళితే సీఎం భజన్‌లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ అకస్మాత్తుగా  అనారోగ్యం పాలవడంతో శుక్రవారం అర్థరాత్రి ఎస్‌ఎంఎస్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయనకు పరీక్షలు చేసి, చికిత్సనందిస్తోంది. శుక్రవారం సీఎం భజన్‌లాల్ శర్మ పుట్టినరోజు.. అదే రోజు ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అయన సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. 

కాగా సీఎం భజన్‌లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ శుక్రవారం తన కుమారుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకోసం ఆయన భరత్‌పూర్ నుంచి జైపూర్ వచ్చారు. అర్థరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
 ఇది కూడా చదవండి: ‘నేనెక్కడికీ వెళ్లడంలేదు’ రోదిస్తున్న మహిళలకు శివరాజ్‌ భరోసా!

Advertisement
 
Advertisement
 
Advertisement