బీజేపీకి పార్టీ ఫండ్‌గా ప్రధాని మోదీ రూ.2వేల విరాళం | Lok Sabha Elections: PM Modi Donates Rs 2000 As Party Fund To BJP Ahead Of Polls, Urges All To Contribute - Sakshi
Sakshi News home page

బీజేపీకి పార్టీ ఫండ్‌గా ప్రధాని మోదీ రూ.2వేల విరాళం

Published Sun, Mar 3 2024 5:06 PM

PM donates Rs 2000 as party fund to BJP - Sakshi

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీకి రూ.2000 విరాళంగా ఇచ్చారు. ‘నమో’ యాప్ ద్వారా శనివారం ఈ విరాళాన్ని ప్రధాని మోదీబీజేకి పార్టీ ఫండ్‌గా అందజేశారు. ఈ సందర్భంగా ‘నమో’ యాప్ ద్వారా ‘డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మోదీ  పిలుపునిచ్చారు. ఈ పేమెంట్‌కు సంబంధించిన స్లిప్‌ను షేర్ చేశారు.

‘బీజేపీకి దోహదపడటం, వికసిత్‌ భారత్ నిర్మాణం కోసం మన ప్రయత్నాలను బలోపేతం చేయటం సంతోషంగా ఉంది. ‘నమో’ యాప్ ద్వారా ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుతున్నాను’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్ ’లో పోస్ట్ చేశారు.


 
డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్.. ప్రచార కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఆయన కూడా రూ. 1000 విరాళాన్ని పార్టీకి అందించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో వికసిత్‌ భారత్‌ నిర్మాణం కోసం నేను బీజేపీకి విరాళం ఇచ్చాను. నమో యాప్‌ ద్వారా అందరూ ‘డొనేషన్‌ ఫర్‌ నేషన్‌ బిల్డింగ్‌’ కార్యక్రమంలో  పాల్గొనండి’ అని జేపీ నడ్డా ‘ఎక్స్‌’ ద్వారా పిలుపునిచ్చారు.

ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2022-2023 ఏడాదిలో బీజేపీ రూ. 719 కోట్లు సేకరించినట్లు తెలిపింది. అదేవిధంగా 2021-2022తో పోల్చితే 17 శాతం అధికం. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ 2022 -2023 ఏడాదికి రూ. 79 కోట్లు,  2021-2022 ఏడాదికి రూ. 95.4 కోట్లు  పార్టీ ఫండ్‌ సేకరించినట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement