కిడ్నాప్‌ కేసులో రేవణ్ణ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో రేవణ్ణ అరెస్ట్‌

Published Sun, May 5 2024 5:05 AM

Revanna arrested from Deve Gowda residence in abduction case

కస్టడీలోకి తీసుకుని ప్రశి్నస్తున్న సిట్‌ అధికారులు 

సాక్షి, బెంగళూరు: మహిళ కిడ్నాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీ (ఎస్‌) సీనియర్‌ నేత, పార్టీ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను సిట్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ ఆయన పెట్టుకున్న ముందస్తు బె యిల్‌ను ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ని రాకరించిన వెంటనే సిట్‌ రేవణ్ణను అదుపులో కి తీసుకోవడం గమనార్హం.

 గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన బాధితురాలిని రేవణ్ణ అనుచరుడు సతీశ్‌ బాబన్న కిడ్నాప్‌ చేశాడని బాధితురాలి కుమారుడు గురువారం రాత్రి మైసూరులో ఫిర్యాదుచేయ డంతో పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం బెంగళూరులోని పద్మనాభనగర్‌లోని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నివాసంలో ఉన్న రేవణ్ణను అక్కడే అరెస్ట్‌చేశారు. తర్వాత ఆయనను బౌరింగ్‌ ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లారు. ఈ కేసులో రేవణ్ణ సహచరుడు సతీశ్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు. ఈ కే సులో నిర్బంధంలో ఉన్న మహిళను మైసూ రు జిల్లాలోని కలెనహళ్లి గ్రామంలోని ఫామ్‌హౌజ్‌లో పోలీసులు శనివారం కాపాడారు. 
 


ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్‌ నోటీస్‌!: లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హసన్‌ సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌పై నమోదైన కేసులో విచారణను సిట్‌ వేగవంతంచేసింది. ఇందులోభాగంగా ప్రజ్వల్‌కు సీబీఐ బ్లూ కార్నల్‌ నోటీసును జారీచేసే వీలుందని తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిట్‌ అధికారులతో ముఖ్యమైన సమావేశం ఏర్పాటుచేశారు. ప్రజ్వల్‌ను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేలా కేసు దర్యాప్తును ముమ్మరంచేయాలని ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement