
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ దాడులకు భయపడొద్దని వైస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం ఆయన జీవీఎంసీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
’’కార్పొరేషన్ స్థానిక సంస్థలలో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది.. వాటికి లొంగకుండా అందరం కలిసి సమష్టి సమీక్షలు నిర్వహిస్తున్నాం. దాడులకు కూడా భయపడొద్దని, పార్టీ ఆదుకుంటుందని శ్రేణులకు భరోసా ఇస్తున్నాం. కార్యకర్తలకు అన్నీ విధాలుగా పార్టీ అందుబాటులో ఉంటుంది. ఆదుకుంటుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
ఎన్‌డీఏకు కూడా పూర్తి స్థాయి మెజారిటీ లేని పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు కీలకం కానున్నాయి. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.