అమేథీ కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం | Sakshi
Sakshi News home page

అమేథీ కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం

Published Mon, May 6 2024 9:55 AM

Amethi Congress Office attacked Cars Vandalised uttar pradesh

లక్నో: లోక్‌సభ ఎన్నికల వేళ​ ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన అమేథీ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. పార్టీ కార్యాయంలో బయట పార్కింగ్‌ చేసిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటన సమాచారం అందుకున్న కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని దాడికి వ్యతిరేకంగా నిసన తలిపారు. దీంతో కార్యకర్తలను నిరసనను పోలీసులు శాంతింపచేశారు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తామని, ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలపారు.

మరోవైపు.. ఈ దాడిని బీజేపీ చేయించిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేస్తోంది.  ‘‘స్మృతి ఇరానీ, బీజేపీ  కార్యకర్తలు  భయపడుతున్నారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ కార్యకర్తలు గూండాల్లా కాంగ్రెస్‌ పార్టీపై దాడి చేశారు. కార్లను ధ్వసం చేశారు. అక్కడితో కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానికులపై కూడా బీజేపీ రౌడీలు దాడి చేశారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో బీజేపీ అమేథీలో దారుణంగా ఓడిపోతుందని అర్థమవుతోంది’’అని  కాంగ్రెస్‌ పార్టీ ‘ఎక్స్‌’ వేదికగా  బీజేపీపై మండిపడింది. బీజేపీ కార్యకర్తల దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని కాంగ్రెస్‌ నేత సుప్రీయా శ్రీనతే మండిపడ్డారు.  ​  

Advertisement
 
Advertisement
 
Advertisement