టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Published Wed, May 15 2024 3:40 PM

Ysrcp Complaint To Ap Dgp In Tdp Attacks

సాక్షి, గుంటూరు: టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్‌ బూత్‌లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు.

‘‘వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లు చేశారు.టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్‌ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగింది?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.

‘‘పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదు. దీంతో వారు పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేశారు. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథచ్చగా తిరగనిచ్చారు. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు. అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?. అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్టడం వలన హింస జరిగింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

‘‘ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.

పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలు: మాజీ మంత్రి పేర్ని
టీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?. రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్‌ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది. బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు. పురంధేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement