Asia Cup 2023: నిప్పులు చెరిగిన పతిరణ.. తిప్పేసిన తీక్షణ | Asia Cup 2023, Bangladesh Vs Sri Lanka: As Matheesha Pathirana Bangs, Bangladesh All Out For 164 - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: నిప్పులు చెరిగిన పతిరణ.. తిప్పేసిన తీక్షణ

Published Thu, Aug 31 2023 8:16 PM | Last Updated on Thu, Aug 31 2023 8:29 PM

Asia Cup 2023: As Matheesha Pathirana Bangs, Bangladesh All Out For 164 - Sakshi

ఆసియా కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 31) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు విజృంభించారు. ఫాస్ట్‌ బౌలర్‌ మతీష పతిరణ నిప్పులు చెరిగే వేగంతో బంతులు సంధించి 4 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ​ (8-1-19-2) తన స్పిన్‌ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వీరికి ధనంజయ డిసిల్వ (10-0-35-1), దునిత్‌ వెల్లలగే (7-0-30-1), కెప్టెన్‌ షనక (3-0-16-1) తోడవ్వడంతో బంగ్లాదేశ్‌ 42.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది.

బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్‌ హొసేన్‌ షాంటో (122 బంతుల్లో 89; 7 ఫోర్లు) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, తన జట్టు ఓ మోస్తరు స్కోరైనా చేసేందుకు తోడ్పడగా.. తౌహిద్‌ హ్రిదోయ్‌ (20), ఓపెనర్‌ మొహమ్మద్‌ నైమ్‌ (16), ముష్ఫికర్‌ రహీమ్‌ (13) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. తంజిద్‌ హసన్‌, తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ డకౌట్లు కాగా.. కెప్టెన్‌ షకీబ్‌ 5, మెహిది హసన్‌ మీరజ్‌ 5,మెహిది హసన్‌ 6, షోరిఫుల్‌ ఇస్లాం 2 పరుగులతో అజేయంగా నిలిచారు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభంలోనే వికెట్లు కోల్నోయి ఎదురీదుతోంది. ఆ జట్టు 43 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. పథుమ్‌ నిస్సంక (14).. షోరీఫుల్‌ ఇస్లాం బౌలింగ్‌లో ముష్ఫికర్‌ రహీంకు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కాగా.. కరుణరత్నేను (1) తస్కిన్‌ అహ్మద్‌, కుశాల్‌ మెండిస్‌ను (5) షకీబ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. 14 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్‌ స్కోర్‌ 58/3గా ఉంది. సమరవిక్రమ (25), అసలంక (8) క్రీజ్‌లో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement