రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌.. ఎస్ఆర్‌హెచ్ స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ! తుది జ‌ట్లు | Sakshi
Sakshi News home page

RR vs SRH: రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌.. ఎస్ఆర్‌హెచ్ స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ! తుది జ‌ట్లు

Published Thu, May 2 2024 7:24 PM

Sunrisers Hyderabad wins the toss and opts to bat first

ఐపీఎల్-2024లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. హైద‌రాబాద్ వేదికగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఒకే మార్పుతో బ‌రిలోకి దిగింది. స్టార్ బ్యాట‌ర్ ఐడైన్ మార్‌క్ర‌మ్ స్ధానంలో ఆల్‌రౌండ‌ర్ మార్కో జానెస‌న్ తుది జ‌ట్టులో వ‌చ్చాడు. మ‌రోవైపు రాజ‌స్తాన్ మాత్రం త‌మ జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు. 

కాగా ఈ మ్యాచ్ రాజ‌స్తాన్ కంటే ఎస్ఆర్‌హెచ్‌కు చాలా కీల‌కం. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో ఉన్న రాజ‌స్తాన్ త‌మ ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకోగా.. స‌న్‌రైజ‌ర్స్ మాత్రం పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్ధానంలో నిలిచింది.
తుది జ‌ట్లు

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్

Advertisement
 
Advertisement
 
Advertisement