స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం కుప్పకూలాయి. ఈ ఒక్కరోజు మధ్యాహ్నం వరకు మదుపర్ల సంపద దాదాపు రూ.35లక్షలకోట్లమేర ఆవిరైంది. ఎగ్జిట్‌పోల్ అంచనాలు తప్పడంతో స్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయి నుంచి భారీగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ఒక్కరోజు నష్టం నమోదైంది. సోమవారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తెచ్చిన హుషారు మంగళవారం కొన్ని గంటల వ్యవధిలోనే ఆవిరైంది.
మధ్యాహ్నం 12:47 సమయానికి నిఫ్టీ 1466 పాయింట్లు నష్టపోయి 21,797 వద్దకు చేరింది. సెన్సెక్స్ 4514 పాయింట్లు దిగజారి 71,891 వద్ద ట్రేడవుతోంది.
ఎన్డీయే కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు ప్రస్తుతానికి సమాచారం మెజారిటీ మార్కుతో పోలిస్తే భారీ వ్యత్యాసం లేకపోవడంతో మార్కెట్లు కుప్పకూలాయి. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడితే మాత్రం సూచీలు మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తిరిగి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వరంగ సంస్థల్లో తీసుకున్న నిర్ణయాల్లో భారీ మార్పులు చేయవచ్చనే వాదనలున్నాయి. మరోవైపు అంచనాలకు భిన్నంగా ఇండియా కూటమి పుంజుకోవడంతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment