సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,061.64 పాయింట్లు లేదా 1.34 శాతం లాభంతో 80,178.75 వద్ద, నిఫ్టీ 343.95 పాయింట్లు లేదా 1.44 శాతం లాభంతో 24,251.20 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, లార్సెన్ & టూబ్రో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలు చేరగా.. జేఎస్‌డబ్ల్యు స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 395 పాయింట్లు లాభపడి 24,302కు చేరింది. సెన్సెక్స్ 1,253 పాయింట్లు ఎగబాకి 80,386 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 107.53 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.35 శాతం పెరిగింది. నాస్‌డాక్ 0.16 శాతం పుంజుకుంది.
ఇటీవల భారీగా పడిన మార్కెట్లు షార్ట్‌కవరింగ్‌తో సోమవారం పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో మార్కెట్లు పరుగు పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రపంచస్థాయిలో రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, దీంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు వివరించారు. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో రూపాయి నీరసిస్తోంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment