సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 450.94 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 78,248.13 పాయింట్ల వద్ద, నిఫ్టీ 168.50 పాయింట్లు లేదా 0.71 శాతం నష్టంతో.. 23,644.90 పాయింట్ల వద్ద నిలిచాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, టాటా మోటార్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు నష్టపోయి 23,786కు చేరింది. సెన్సెక్స్(Sensex) 46 పాయింట్లు దిగజారి 78,649 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 108 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 74.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.67 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 2.9 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: స్వల్ప స్థాయిలోనే కదలికలు
2024 బుల్స్, బేర్స్ మధ్య నువ్వా–నేనా అన్నట్టుగా యుద్ధం నడిచిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయని తెలిపారు. ఈ ఒత్తిళ్లను తట్టుకుని మరీ భారత మార్కెట్లు చక్కని రాబడులు ఇచ్చాయన్నారు. దీంతో మన మార్కెట్ల విలువ ప్రపంచంలోనే అత్యంత ఖరీదుగా మారింది. దీనికితోడు అధిక లిక్విడిటీ (నిధుల ప్రవాహం) మార్కెట్ల వ్యాల్యూషన్‌ను గరిష్టాలకు చేర్చిందని చెప్పారు. దీంతో ఫండమెంటల్స్ కూడా పక్కకుపోయాయి. ఇదే అంతిమంగా మార్కెట్లో కరెక్షన్‌ను ఆహ్వానించినట్లయిందని అభిప్రాయపడ్డారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment