ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలి | Sakshi
Sakshi News home page

ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలి

Published Thu, Apr 18 2024 11:40 AM

పలాస ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌ జీడి పరిశ్రమలో అవగాహన   - Sakshi

గార: రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది పాఠశాల, ఇంటర్‌, డిగ్రీలో ప్రవేశాలకు ఈ నెల 25వ తేదీన జరిగే ప్రవేశ పరీక్షకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని వమరవల్లి గురుకుల ప్రిన్సిపాల్‌ చిట్టితల్లి ఓ ప్రకటనలో కోరారు. జిల్లా కేంద్రంలో జరిగే ప్రవేశ పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లను విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీతో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశం కోసం ఏపీఆర్‌ఎస్‌ సీఏటీ –2024 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్‌, డిగ్రీ ప్రవేశ పరీక్ష ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌–2024 కోసం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు జిల్లా కేంద్రంలో పరీక్ష జరుగుతుందన్నారు.

జీడి పరిశ్రమల్లో ప్రమాదాలపై అవగాహన

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అనంతపురం, ఇండస్ట్రియల్‌ పార్కులో జీడి కార్మికులకు, సిబ్బందికి, పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కాశీబుగ్గ అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్నిప్రమాద వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. జీడి పరిశ్రమలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని పరిశ్రమకు నలువైపులా అత్యవసర దారులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి బి.సోమేశ్వరరావు, సిబ్బంది రమేష్‌నాయుడు, యుగంధర్‌, ప్రేమ్‌కుమార్‌, మన్మధరావు, రామనాయుడు, వల్లభరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement