ఆటోబోల్తా: నలుగురికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆటోబోల్తా: నలుగురికి గాయాలు

Published Thu, May 9 2024 4:20 AM

-

సీతంపేట:

మండలంలోని జజ్జువ సమీపంలో బుధవారం ఆటో బోల్తాపడడంతో జరిగిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. తమ గ్రామం నుంచి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి పాలకొండకు ఆటోలో వస్తుండగా మార్గమధ్యంలో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నిమ్మక మాణిక్యం, నారాయణమ్మ, సవర సూరయ్య, రామారావులకు గాయాలయ్యా యి. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కో సం పాలకొండ ఒకరిని, శ్రీకాకుళం రిమ్స్‌కు మ రొ కరిని రిఫర్‌ చేశారు. మిగతా ఇద్దరు కోలుకున్నట్లు ఏఎస్సై సంజీవరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement