జైళ్ల శాఖ రెండో ఐజీగా మురళీబాబు  | Sakshi
Sakshi News home page

జైళ్ల శాఖ రెండో ఐజీగా మురళీబాబు 

Published Fri, Aug 11 2023 1:29 AM

Murali Babu is the second IG of Prisons Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ జైళ్ల శాఖలో ప్రస్తుతం ఉన్న పోస్ట్‌కు అదనంగా.. మరో ఐజీ పోస్ట్‌ ఏర్పాటుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం హైదరాబా­ద్‌ రేంజ్‌ డీఐజీగా పనిచేస్తున్న మురళీబాబు త్వరలో ఐజీ­గా పదోన్నతి పొందనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినందున జైళ్ల శా­ఖలో డీపీసీ (డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) సమావేశమై మురళీబాబుకు ఐజీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇక లాంఛనప్రాయమే.

ఈ మొ­త్తం ప్రక్రియ మరో వారంలోగా ముగిసే అవకాశం ఉండడంతో ఆ తర్వాత మురళీ­బాబు ఐజీగా బాధ్యతలు చే­పట్టనున్నారు. ప్రస్తుతం జైళ్ల­శాఖ ఐజీగా పనిచేస్తున్న రా­జే­శ్‌కుమార్, పదోన్నతిపై ఐజీ­గా బాధ్యతలు స్వీకరించనున్న మురళీబాబుల మధ్య పని విభజన చేయనున్నారు. కాగా, ఈ ఇద్దరు అధికారులు ఒకే బ్యాచ్‌ అధికారులు.

సీనియారిటీ అంశంలో తలెత్తిన వివా­దాన్ని పరిష్కరించే దిశ­గా జైళ్ల శాఖలో రెండో ఐజీ పోస్ట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణ­యించింది. మురళీబాబుకు పదోన్నతి లభించడంతో ఖాళీ అయ్యే డీఐజీ పోస్ట్‌ వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఎస్పీ సంపత్‌కు దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత డీఐజీ శ్రీనివాస్‌తోపాటు సంపత్‌ డీఐజీ హోదా పొందనున్నట్టు సమాచారం.  

Advertisement
 
Advertisement
 
Advertisement