12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించొచ్చు | Sakshi
Sakshi News home page

12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించొచ్చు

Published Wed, May 8 2024 7:50 AM

-

నల్లగొండ: ఓటరు గుర్తింపు కార్డు లేనివారు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్‌ బూత్‌లో చూపించొచ్చని నల్లగొండ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్‌ కార్డు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్‌ కార్డు, ఫొటో ఉన్న బ్యాంక్‌, పోస్టాఫీస్‌ పాస్‌బుక్‌లు, కేంద్ర కార్మిక శాఖ ద్వారా జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌పీఆర్‌ కింద జారీచేసిన స్మార్ట్‌ కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్ట్‌, ఫొటో కలిగిన పెన్షన్‌ డాక్యుమెంట్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌ సంస్థలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు వారి ఉద్యోగులకు జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్‌ దివ్యాంగ కార్డులలో ఏదో ఒకదానిని గుర్తింపుకార్డులుగా చూపవచ్చని తెలిపారు.

ఫ నల్లగొండ జిల్లా కలెక్టర్‌ హరిచందన

Advertisement
 
Advertisement
 
Advertisement