చిందేసిన తెలుగు తమ్ముళ్లు
ఒంగోలు : ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ కార్యకర్తలు తమదైన శైలిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసి రికార్డింగ్ డ్యాన్స్‌ల్లో మునిగి తేలారు. చాలాసేపు అమ్మాయిలు చిందులేస్తుంటే... నేతలు, కార్యకర్తలు నేత్రానందం పొందారు. అయితే మండల అధ్యక్షుడు బేరి పుల్లారెడ్డి, పామూరు సర్పంచ్ మనోహర్ ఓ అడుగు ముందుకు వేసి వేదిక పైకి ఎక్కి అమ్మాయిలతో కలిసి చిందులేశారు. మమ్మల్ని చూడండి....మా పార్టీ తీరు చూడండంటూ చిందులేశారు.
అమ్మాయిల చేతులు పట్టుకుని ఊగిపోయారు. ఓ నేత అయితే ఏకంగా నృత్యం చేస్తున్న అమ్మాయి మెడలో పూలమాల వేసి మరీ ఆనందపడ్డాడు. కాగా ఈ ఘటనపై పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నా బయటకు మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. ఓ వైపు పార్టీ నేత నీతులు చెబుతుంటే...మరోవైపు తెలుగు తమ్ముళ్ల తీరును చూసి ముక్కన వేలేసుకుంటున్నారు.