చైనీస్ సంస్థతో ఆపిల్ సీక్రెట్‌గా...
చైనీస్ సంస్థతో ఆపిల్ సీక్రెట్‌గా...
Published Sat, Jul 22 2017 5:07 PM | Last Updated on Wed, Sep 5 2018 2:17 PM
ఎలక్ట్రిక్ కార్లు రూపకల్పన రోజురోజుకి పెరిగిపోతుంది. వచ్చేళ్లలో మొత్తంలో ఎలక్ట్రిక్ కార్ల హవానే సాగించాలని ఇటు ఆటో దిగ్గజాలు అటు టెక్నాలజీ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ చైనీస్ బ్యాటరీ తయారీ సంస్థతో కలిసి టెక్ దిగ్గజం ఆపిల్ సీక్రెట్‌గా పనిచేస్తోంది. తన ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టును కొనసాగించడానికి ఆపిల్ ఈ కంపెనీతో జతకట్టినట్టు తెలుస్తోంది. కంటెంపరరీ ఆమ్పెరేక్స్ టెక్నాలజీ లిమిటెడ్(సీఏటీఎల్)తో టెక్ దిగ్గజం ఆపిల్ పనిచేస్తుందని షాంఘైకి చెందిన యికై గ్లోబల్ రిపోర్టు చేసింది. బ్యాటరీల రూపకల్పనలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి.
ఆపిల్ మొదట 2013లో తన కారు ప్రాజెక్టుతో ఆటోమేటిష్ ఇండస్ట్రిలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. కానీ తర్వాత ఆటోమొబైల్స్ కోసం సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లను తయారుచేయడానికే పరిమితమైంది. సీఏటీఎల్, 2011లో ఆమ్పెరెక్స్ టెక్నాలజీ లిమిటెడ్‌తో విడిపోయి ఓ స్వతంత్ర బ్యాటరీ తయారీదారిగా మార్కెట్‌లోకి వచ్చింది. ఆపిల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్‌కు సప్లయిర్‌గా ఉంటుంది. అయితే షాంఘై నివేదించిన ఈ రిపోర్టుపై ఆపిల్ స్పందించడానికి నిరాకరించింది.
Advertisement
Advertisement