ఏబీవీపీకి భయపడను: జవాన్‌ కూతురు | abvp againest post viral in fb | Sakshi
Sakshi News home page

ఏబీవీపీకి భయపడను: జవాన్‌ కూతురు

Published Sat, Feb 25 2017 7:26 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

ఏబీవీపీకి భయపడను: జవాన్‌ కూతురు

ఏబీవీపీకి భయపడను: జవాన్‌ కూతురు

ఢిల్లీ: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఇటీవల రాంజాస్‌ కాలేజిలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీ విద్యార్థిని గుర్‌మెహార్‌ కౌర్‌ ఈ పోస్టు చేసింది. 'నేను ఢిల్లీ యూనివర్సిటి విద్యార్థినిని. ఏబీవీపీకి భయపడను. నేను ఒంటిరిదాన్నికాను. నాకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల మద్దతు ఉంది' అని రాసిన ప్లకార్డు చేతపట్టుకుని కౌర్ దిగిన ఫోటోను అప్‌లోడ్‌ చేసింది.

జేఎన్‌యూకు చెందిన ఉమర్‌ ఖలీద్‌ రాంజాస్‌ కాలేజికి రావడానికి వ్యతిరేకిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. దీనికి నిరసనగా గుర్‌మెహార్‌  స్పందించింది. కార్గిల్‌ యుద్దంలో వీరమరణం పొందిన కెప్టెన్‌ మన్‌దీప్‌ సింగ్‌ కూతురు ఆమె. ఏబీవీపీ దాడి అమాయక విద్యార్థులకు అవాంతరం కలిగించిందని పోస్టులో పేర్కొంది. ఇది నిరసనకారులపై దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అభిప్రాయపడింది. స్వేచ్చ, ఆదర్శాలు, విలువలు, పౌరుడి హక్కులపై దాడి జరిగినట్లు అభివర్ణించింది. ఈ చర్యతో ప్రతి భారత పౌరుడు బాధపడ్డాడని చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement