రాంజాస్‌ కాలేజీలో రణరంగం! | Ramjas College protests, Students clash | Sakshi
Sakshi News home page

రాంజాస్‌ కాలేజీలో రణరంగం!

Published Wed, Feb 22 2017 3:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

రాంజాస్‌ కాలేజీలో రణరంగం!

రాంజాస్‌ కాలేజీలో రణరంగం!

  • పోలీసులతో విద్యార్థుల ఘర్షణ
  • ఉమర్‌ ఖలీద్‌కు ఆహ్వానంపై రగడ


  • న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్‌ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువరు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖలిద్‌ను రాజాంస్‌ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది.

    ఉమర్‌ ఖలీద్‌ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్‌ ఖలీద్‌, షెహ్లా రషీద్‌ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్‌, డీయూ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఏఐఎస్‌ఏ నేతృత్వంలో మౌలిస్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement